తెలంగాణ

telangana

KRMB MEET: త్వరలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ.. నీటివాటాలపై చర్చ

By

Published : Jan 22, 2022, 5:25 AM IST

KRMB MEET: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ వచ్చే వారం సమావేశం కానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యాసంగి సీజన్ సాగునీటితో పాటు తాగునీటి అవసరాల కోసం నీటి విడుదల అంశంపై సమావేశంలో చర్చించనుంది.

KRMB MEET
కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ

KRMB MEET: యాసంగి సీజన్​లో తెలుగు రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాసలపై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ వచ్చేవారంలో భేటీ కానుంది. ఈ నేపథ్యంలో రబీ సీజన్ సాగు, తాగునీటి అవసరాలకు సంబంధించిన వివరాలు పంపాలని రెండు రాష్ట్రాలను కృష్ణా బోర్డు కోరింది.

letters to ENCS: ఈ నెల 24వ తేదీ వరకు వివరాలు ఇవ్వాలని కోరుతూ కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి రాయిపురే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీలకు ఇప్పటికే లేఖలు రాశారు. రెండు రాష్ట్రాల నుంచి వివరాలు అందాక తేదీ ఖరారు చేసి త్రిసభ్య కమిటీ సమావేశమవుతుందని తెలిపారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details