తెలంగాణ

telangana

కిడ్నాప్​ కేసు: భార్గవ్​రామ్​, జగత్​విఖ్యాత్​రెడ్డి సహా ఆరుగురికి బెయిల్

By

Published : Mar 9, 2021, 3:29 PM IST

Updated : Mar 9, 2021, 4:25 PM IST

బోయిన్​పల్లి కిడ్నాప్​ కేసులో నిందితులకు హైకోర్టు బెయిల్​ మంజూరు చేసింది. ‌అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి సహా మొత్తం ఆరుగురికి బెయిలిచ్చింది.

The High Court granted bail to six persons, including Bhargav Ram and Jagat Vikyat Reddy
కిడ్నాప్​ కేసు: భార్గవ్​రామ్​, జగత్​విఖ్యాత్​రెడ్డి సహా ఆరుగురికి బెయిల్

బోయిన్‌పల్లి అపహరణ కేసులో నిందితులకు బెయిల్ లభించింది. ‌అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని ఆదేశించింది.

ఇదే కేసులో చంచల్​గూడ జైల్లో రిమాండ్​ ఖైదీలుగా ఉన్న భార్గవ్‌రామ్ తల్లిదండ్రులు కిరణ్మయి, నాయుడు, సిద్ధార్థ, మల్లికార్జునరెడ్డి సహా మొత్తం ఆరుగురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

భూ వివాదంలో బ్యాడ్మింటన్​ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు, ఆయన సోదరులను అపహరించిన కేసులో నలుగురు నిందితులు సికింద్రాబాద్ కోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. అక్కడ బెయిల్​ లభించకపోవడం వల్ల హైకోర్టును ఆశ్రయించారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం.. బెయిల్ మంజూరు చేసింది.

ప్రవీణ్​ సోదరుల అపహరణ జరిగినప్పటి నుంచి భార్గవ్​రామ్, జగత్​విఖ్యాత్​రెడ్డితో పాటు గుంటూరు శ్రీను పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి బెంగుళూరుతో పాటు.. కర్నూల్, కడప, విజయవాడల్లో గాలించారు. అయినా నిందితుల ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం గుంటూరు శ్రీనుకు బెయిల్ మంజూరు కాలేదు.

ఇదీ చూడండి: ఏ1 ఏవీ సుబ్బారెడ్డి, ఏ2 అఖిలప్రియ, ఏ3 భార్గవరామ్

Last Updated : Mar 9, 2021, 4:25 PM IST

ABOUT THE AUTHOR

...view details