తెలంగాణ

telangana

TS WEATHER REPORT: రాష్ట్రంలో రాగల మూడ్రోజులు మోస్తరు వర్షాలు

By

Published : Jul 28, 2021, 3:01 PM IST

రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(rains in telangana) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(India Meteorological Department) తెలిపింది. పశ్చిమ దిశనుంచి రాష్ట్రంలోకి గాలులు వీస్తుండటంతో అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని వెల్లడించింది. బంగ్లాదేశ్‌ తీరం పరిసర పశ్చిమ బంగాల్ ప్రాంతాల మీదుగా కొనసాగుతుందని పేర్కొంది.

TS WEATHER REPORT, telangana rain alert
తెలంగాణలో వర్ష సూచన, రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు

రాష్ట్రంలో రాగల మూడ్రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు(rains in telangana) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణకేంద్రం(India Meteorological Department) వెల్లడించింది. పశ్చిమ దిశనుంచి రాష్ట్రంలోకి గాలులు వీస్తుండటంతో అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి... బంగ్లాదేశ్‌ తీరం పరిసర పశ్చిమ బంగాల్ ప్రాంతాల మీదుగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా... ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపోస్పియర్ వరకు స్థిరంగా కొనసాగుతుందని వివరించారు. వచ్చే 48 గంటల్లో అది పశ్చిమ దిశగా కదులుతూ బంగాల్‌, ఝార్ఖండ్, బిహార్‌ మీదుగా వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.

ఇదీ చదవండి:Ramppa: యునెస్కో విధించిన గడువు వరకు సమగ్ర సంరక్షణ చేపట్టాలి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details