తెలంగాణ

telangana

Telangana Top News: టాప్​న్యూస్ @9PM

By

Published : Oct 27, 2022, 8:59 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

today top news in telangana
today top news in telangana

  • తెరాస ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు.. ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్..

రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏ-1గా దిల్లీకి చెందిన రామచంద్రభారతి, ఏ-2గా హైదరాబాద్ కు చెందిన నందకిశోర్, ఏ-3గా తిరుపతికి చెందిన సింహయాజులుపై కేసు నమోదు చేశారు.

  • ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెరాస నేతలకు కేటీఆర్‌ కీలక సూచన

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ప్రాథమిక దర్యాప్తు దశలో ఉందని పేర్కొన్నారు. తెరాస నేతలు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కేటీఆర్‌ సూచించారు.

  • "తెరాసతో నందకుమార్‌కు సత్సంబంధాలు.. ఇవిగో సాక్ష్యాలు"

తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాల వ్యవహారంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఉప ఎన్నికలో ఓటమి ఖాయమని గ్రహించే తెరాస కొత్త నాటకానికి తెరతీసిందని ఆరోపించారు.

  • 'తెరాస, భాజపాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి'

కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని తెరాస ఎమ్మెల్యేల కొనుగోళ్లతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. 8 ఏళ్లుగా భాజపా తెచ్చిన అన్ని బిల్లులను తెరాస సమర్థించిందన్న ఆయన.. రెండు పార్టీలను నాణేనికి బొమ్మ-బొరుసుగా అభివర్ణించారు.

  • ఆ కుటుంబాలకు నవంబర్​ చివరిలోగా ఉద్యోగాలు: సీఎం

ఏపీలోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం మూడో యూనిట్‌ను ఆ రాష్ట్ర సీఎం జగన్‌ జాతికి అంకితం చేశారు. థర్మల్‌ కేంద్రం కోసం భూములిచ్చిన రైతులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. నిర్వాసితుల కుటుంబాలకు నవంబర్ పూర్తయ్యేలోగా ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు.

  • వివాదాస్పద నేత ఆజం ఖాన్​కు మూడేళ్ల జైలు శిక్ష..

ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​పై విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసిన సమాజ్​వాదీ పార్టీ ఎమ్మెల్యే ఆజం ఖాన్​కు మూడేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది రామ్​పుర్​ కోర్టు.

  • అధికారిక నివాసానికి రిషి..

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ అధికారిక నివాసంలోకి మారనున్నారు. తనకున్న ఎన్నో విలాసవంతమైన భవనాలను వదిలి.. ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లో ఉండేందుకు నిర్ణయించుకున్నారు.

  • 'శుక్రవారం నాటికి ట్విట్టర్​ను కొనేస్తా'

ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని శుక్రవారం (2022, అక్టోబర్‌ 28) నాటికి ముగిస్తానని టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ బ్యాంకర్లకు తెలిపారు. ఈ ఒప్పందానికి కావాల్సిన నిధులను సమకూరుస్తున్న బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు.

  • ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే విజయం.. పాక్​ సెమీస్​ చేరడం కష్టమే!

T20 World Cup Zim Vs Pak: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఉత్కంఠభరిత పోరులో పాకిస్థాన్‌ జట్టుపై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది జింబాబ్వే.

  • 'ఇండియన్ సినిమాలోనే మాస్టర్ పీస్'.. కాంతారపై సూపర్​స్టార్ ప్రశంసలు

'కాంతార'... సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ దిగ్గజాల వరకూ అందరి నోట వినబడుతున్న మాట. అంతలా ఈ కన్నడ సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. రిషభ్ శెట్టి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. తాజాగా ఈ సినిమాని చూసిన రజనీకాంత్‌ ప్రశంసలు కురిపించారు.

ABOUT THE AUTHOR

...view details