తెలంగాణ

telangana

Telangana Teachers Transfer Schedule 2023 : ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు షెడ్యూల్ ఖరారు.. ఈ తేదీలు గుర్తుంచుకోండి

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2023, 3:50 PM IST

Telangana Teachers Transfer Schedule 2023 : ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ ఖరారు చేసింది. బదిలీలు, పదోన్నతులకు నేటి వరకు (సెప్టెంబరు 1) సర్వీసును కటాఫ్‌గా నిర్ణయించారు. ఈ నెల 3 నుంచి అక్టోబరు 3 వరకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగించి.. 15 రోజుల పాటు అప్పీళ్లు స్వీకరించి పరిష్కరిస్తారు. హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా నిబంధనలు, షెడ్యూలులో మార్పులు చేసిన పాఠశాల విద్యా శాఖ.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.

ts teacher transfers from september 3
Telangana Teachers Transfer Schedule 2023

Telangana Teachers Transfer Schedule 2023 : హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. నిబంధనలను, షెడ్యూల్‌ను సవరిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. సెప్టెంబరు 1ని సర్వీసుకు కటాఫ్‌గా నిర్ణయించారు. ఇవాళ్టికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను.. ఎనిమిదేళ్లుగా పని చేస్తున్న టీచర్లను తప్పనిసరిగా బదిలీ చేస్తారు. నేటి నుంచి మూడేళ్లలో పదవీ విరమణ చేయనున్న హెచ్ఎంలను, టీచర్లను బదిలీ చేయరు.

High Court Permits Teachers Transfers in Telangana : రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

కనీసం రెండేళ్లుగా ఒకేచోట పని చేస్తున్న హెచ్ఎంలు, టీచర్లు బదిలీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యా శాఖ పేర్కొంది. గతంలో బదిలీ కోసం దరఖాస్తు చేసుకోని టీచర్లు, హెచ్ఎంలు ఈ నెల 3 నుంచి 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్‌లో పేర్కొన్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఈ నెల 12, 13 తేదీల్లో గ్రేడ్ 2 హెచ్ఎంల నుంచి వెబ్ ఆప్షన్లను స్వీకరించి.. ఈ నెల 15న బదిలీ చేస్తారు.

Telangana Teacher Transfers 2023 : సెప్టెంబర్ 3 నుంచి టీచర్ల బదిలీల ప్రక్రియ షురూ..

ఈ నెల 17 నుంచి 19 వరకు స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు ఇస్తారు. ఈ నెల 20, 21 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ల వెబ్ ఆప్షన్లు స్వీకరించి.. ఈ నెల 23, 24న బదిలీ చేస్తారు. ఈ నెల 26 నుంచి 28 వరకు ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తారు. ఈ నెల 29 నుంచి అక్టోబరు 1 వరకు ఎస్జీటీల వెబ్ ఆప్షన్లను స్వీకరించి.. 3వ తేదీన బదిలీలు చేస్తారు. అక్టోబర్ 5 నుంచి 19 వరకు అప్పీళ్లు స్వీకరించి.. పరిష్కరించేలా షెడ్యూల్ ఖరారు చేశారు.

షెడ్యూల్‌లోని ముఖ్యమైన అంశాలు..:

  • సెప్టెంబరు 1 సర్వీసుకు కటాఫ్‌గా నిర్ణయం
  • నేటికి ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు.. 8 ఏళ్లుగా పని చేస్తున్న టీచర్లను బదిలీ చేస్తారు
  • నేటి నుంచి మూడేళ్లలో పదవీ విరమణ చేయనున్న హెచ్ఎంలు, టీచర్లను బదిలీ చేయరు
  • గతంలో బదిలీ కోసం దరఖాస్తు చేసుకోని టీచర్లు, హెచ్ఎంలు ఈ నెల 3 నుంచి 5 వరకు దరఖాస్తు చేసుకోవాలి
  • ఈ నెల 8, 9 తేదీల్లో సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు.
  • 12, 13 తేదీల్లో గ్రేడ్ 2 హెచ్ఎంల నుంచి వెబ్ ఆప్షన్ల స్వీకరణ.. ఈ నెల 15న బదిలీ
  • ఈ నెల 17 నుంచి 19 వరకు స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు
  • ఈ నెల 20, 21 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ల వెబ్ ఆప్షన్లు స్వీకరణ
  • ఈ నెల 23, 24 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ల బదిలీ
  • ఈ నెల 26 నుంచి 28 వరకు ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి
  • ఈ నెల 29 నుంచి అక్టోబరు 1 వరకు ఎస్జీటీల వెబ్ ఆప్షన్లను స్వీకరణ
  • అక్టోబర్ 3వ తేదీన ఎస్జీటీల బదిలీలు
  • అక్టోబర్ 5 నుంచి 19 వరకు అప్పీళ్ల స్వీకరణ.. పరిష్కారం

ఉపాధ్యాయుల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. 317 జీఓ ఉపాధ్యాయులకూ అవకాశం

ABOUT THE AUTHOR

...view details