తెలంగాణ

telangana

Telangana Teachers Transfer Schedule 2023 : ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ ఖరారు

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2023, 8:32 AM IST

Updated : Sep 1, 2023, 9:15 AM IST

Telangana Teachers Transfer Schedule 2023 : ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ ఖరారు చేసింది. ఈ నెల 3 నుంచి 5 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు.. 8, 9 తేదీల్లో సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ ఉండనుంది.

Telangana Teachers Transfer Schedule
Telangana Teachers

Telangana Teachers Transfer Schedule 2023 : తెలంగాణ సర్కార్ ఉపాధ్యాయులకు తీపి కబురు అందించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. సెప్టెంబరు 3 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. అక్టోబర్ 3వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ఆ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి ఇవాళ షెడ్యూల్ ఖరారు చేశారు.

Telangana Teachers Promotions Schedule 2023 : హైకోర్టు తీర్పునకు లోబడి టీచర్ల పదోన్నతులు బదిలీలు చేయాలని గురువారం రోజున విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పారదర్శకతతో, అపోహలకు తావులేకుండా పదోన్నతులు, బదిలీల ప్రక్రియ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని అర్హులైన టీచర్లకు మెసేజ్​ పంపాలని సూచించారు. ఆన్​లైన్​ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు.

ఈ షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఉంటుంది. 8, 9వ తేదీల్లో సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ.. 12, 13వ తేదీల్లో గ్రేడ్-2 హెచ్ఎంల బదిలీలకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఈ నెల 15వ తేదీన గ్రేడ్-2 ప్రధాన ఉపాధ్యాయులబదిలీల ప్రక్రియ చేపడతారు. ఇక 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు స్కూల్ అసిస్టెంట్లకు హెచ్‌ఎంగా పదోన్నతుల ప్రక్రియ జరుగుతుంది.

Telangana Teacher Transfers 2023 : సెప్టెంబర్ 3 నుంచి టీచర్ల బదిలీల ప్రక్రియ షురూ.. ఒకట్రెండు రోజుల్లో షెడ్యూల్​ విడుదల

Telangana Teachers Transfer Promotions Schedule :ఈ నెల 20, 21వ తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ బదిలీలకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని విద్యాశాఖ వెల్లడించింది. 23, 24న స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు.. 26 నుంచి 28వ తేదీన ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఉంటాయని తెలిపింది. 29 నుంచి అక్టోబరు 1 వరకు ఎస్జీటీల బదిలీలకు వెబ్ ఆప్షన్లు.. అక్టోబరు 3వ తేదీన ఎస్జీటీల బదిలీ.. అక్టోబరు 5 నుంచి 19వ తేదీ వరకు అప్పీళ్లకు అవకాశం ఉంటుందని పేర్కొంది.

ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు విద్యాశాఖ ఖరారు చేసిన షెడ్యూల్‌ ఇదే

  • ఈ నెల 3 నుంచి 5 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు
  • ఈ నెల 8, 9 తేదీల్లో సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ
  • ఈ నెల 12, 13 తేదీల్లో గ్రేడ్-2 హెచ్ఎంల బదిలీలకు వెబ్ ఆప్షన్లు
  • ఈ నెల 15న గ్రేడ్-2 ప్రధాన ఉపాధ్యాయుల బదిలీలు
  • ఈ నెల 17 నుంచి 19 వరకు స్కూల్ అసిస్టెంట్లకు హెచ్‌ఎంగా పదోన్నతులు
  • ఈ నెల 20, 21 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ బదిలీలకు వెబ్ ఆప్షన్లు
  • ఈ నెల 23, 24న స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు
  • ఈ నెల 26 నుంచి 28న ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి
  • ఈ నెల 29 నుంచి అక్టోబరు 1 వరకు ఎస్జీటీల బదిలీలకు వెబ్ ఆప్షన్లు
  • అక్టోబరు 3న ఎస్జీటీల బదిలీ
  • అక్టోబరు 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు అవకాశం

Telangana Govt Approves 5089 Teacher Posts : డీఎస్సీ ద్వారా 5,089 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి

DSC Candidates Protest at Assembly in Telangana : మెగా నోటిఫికేషన్ కావాలంటూ అసెంబ్లీ ముందు​ డీఎస్సీ అభ్యర్థుల మహాధర్నా

Last Updated :Sep 1, 2023, 9:15 AM IST

ABOUT THE AUTHOR

...view details