తెలంగాణ

telangana

Telangana Leaders Reaction on Womens Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్ర నాయకుల మధ్య లొల్లి..!

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2023, 8:42 PM IST

Telangana Leaders Reaction on Womens Reservation Bill : మహిళా రిజర్వేషన్ల బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టడాన్ని రాష్ట్రంలో రాజకీయ పార్టీలు స్వాగతించాయి. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లును జాప్యం చేయకుండా ఆమోదించడంతో సహా.. ఓబీసీ రిజర్వేషన్లను కూడా చేర్చాలని బీఆర్​ఎస్​ డిమాండ్‌ చేసింది. నూతన పార్లమెంటులో మహిళా రిజర్వేషన్లతో కేంద్ర ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని బీజేపీ తెలిపింది. బీఆర్​ఎస్​ నేతలు విమర్శలు మాని ముందు రాష్ట్రంలో మహిళా కోటా అమలు చేసి చూపించాలని బీజేపీ పేర్కొంది. కాంగ్రెస్‌ ఈ బిల్లును ఎన్నికల ఎత్తుగడగా అభివర్ణించింది.

BRS Leaders Reaction on Womens Reservation Bill
Congress Leaders Reaction on Womens Reservation Bill

Womens Reservation Bill మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు

Telangana Leaders Reaction on Womens Reservation Bill : మహిళా రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య రాజకీయ వేడి రాజేసింది. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు బీఆర్​ఎస్​ ప్రకటించింది. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్​ఎస్​ పోరాటం ఫలించిందని మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లుపై ఇప్పటికైనా ఓ ముందడుగు పడిందని ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీ కవిత.. తదితర నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఓబీసీ రిజర్వేషన్లను కూడా బిల్లులో చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ బిల్లు చట్టం రూపు దాల్చితే మరింత మంది మహిళలకు లాభదాయకంగా ఉంటుందని పలువురు నాయకులు తెలిపారు.

Women's Reservation Bill Effect on Telangana Politics : మహిళా రిజర్వేషన్ల బిల్లుతో సమూలంగా మారనున్న రాష్ట్ర రాజకీయ సమీకరణాలు

BJP Leaders Reaction on Womens Reservation Bill in Telangana : మహిళా రిజర్వేషన్ల బిల్లు(Womens Reservation Bill) నూతన పార్లమెంటు భవనంలో.. కీలక ముందడుగుగా అభివర్ణించిన బీజేపీ అన్ని పార్టీలు ఇందుకు మద్దతు పలకాలని కోరింది. మహిళలకు బీజేపీ పెద్దపీట వేస్తోందని ఎంపీ లక్ష్మణ్‌, బీజేపీ జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. ఎమ్మెల్సీ కవిత రిజర్వేషన్ల బిల్లును తమ ఘనతగా చెప్పుపోవడం విడ్డూరమని విమర్శించారు. ముందుగా బీఆర్​ఎస్​లో మహిళలకు సరైన ప్రాధాన్యం ఇచ్చి అప్పుడు మాట్లాడాలన్నారు.

"మహిళా రిజర్వేషన్​ బిల్లు ఆమోదం పొందడం వెనుక కేసీఆర్​, కవిత వారి కృషే ఉందని చెప్పుకోడం విచారకరం. కవితను తప్ప ఇతర మహిళలను గౌరవించే అలవాటు కేసీఆర్​కి లేదు. అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్​ఎస్​ సీట్లు కేటాయింపులో కనీసం మహిళలకు 15 శాతం కూడా ప్రకటించలేదు. బీఆర్​ఎస్​ కమిటీల్లో.. పార్టీలోనూ మహిళలకు కీలకమైన స్థానం ఉందా ?. " - డీకేఅరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు


Telangana Congress Leaders React onWomens Reservation Bill : రాజకీయంగా లబ్ధి పొందేందుకు బీజేపీ ఎన్నికల ముంగిట.. మహిళా రిజర్వేషన్ల బిల్లు తెచ్చిందని కాంగ్రెస్‌ విమర్శించింది. వెంటనే రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదని తెలిసీ కూడా వీటిని తెరపైకి తెచ్చారని విమర్శించారు. మహిళా బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం శుభపరిణామమని వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఈ బిల్లు ప్రవేశపెట్టడంపై ప్రజల్లో అనుమానాలున్నాయని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు బిల్లు తెచ్చారని బీఎస్​పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్‌(BSP Leader RS Praveen Kumar) విమర్శించారు. మహిళా రిజర్వేషన్లు బిల్లు పార్లమెంటుకు రావడంపై రాష్ట్రంలోని పలుచోట్ల బీఆర్​ఎస్​, బీజేపీ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు.

Womens Reservation Bill 2023 : మహిళా రిజర్వేషన్ బిల్లు ఎన్నికల 'జుమ్లా'.. ఆ నిబంధనలు చేర్చడం తప్పు: విపక్షాలు

Women Reservation Bill 2023 Today in Lok Sabha : లోక్​సభ ముందుకు మహిళా బిల్లు.. ఆమోదం ఎప్పుడంటే..

YS Sharmila Letters to Kavitha : 'మహిళా రిజర్వేషన్లపై ముందడుగు.. బీఆర్ఎస్ నుంచే ప్రారంభం కావాలి'

TAGGED:

ABOUT THE AUTHOR

...view details