తెలంగాణ

telangana

అఖిల భారత సర్వీస్‌ అధికారుల కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

By ETV Bharat Telangana Team

Published : Jan 3, 2024, 6:43 PM IST

Updated : Jan 3, 2024, 7:42 PM IST

Telangana High Court on CAT Orders in IAS Officers Case : ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల కేటాయింపుపై గతంలో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. కేంద్రం లేవనెత్తిన సవాల్‌పై హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయితే పునః కేటాయింపులు చేసే వరకు ఐఏఎస్‌లు యథాతథంగా కొనసాగవచ్చని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Telangana HC Struck Down CAT Order
Telangana High Court

Telangana High Court on CAT Orders in IAS Officers Case : క్యాట్ ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. కేటాయింపులపై అభ్యంతరాలున్న అఖిల భారత సర్వీస్ అధికారుల విజ్ఞప్తులను మరోసారి పరిగణలోకి తీసుకొని తిరిగి కేటాయింపులు జరపాలని హైకోర్టు(Telangana High Court) ధర్మాసనం, కేంద్రాన్ని ఆదేశించింది. అప్పటి వరకు ఆయా ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగొచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లకుండా క్యాట్ ఉత్తర్వులతో కొనసాగుతున్న అఖిల భారత సర్వీస్ అధికారులపై కేంద్రం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపు విషయంలో క్యాట్(CAT) తన పరిధి దాటి వ్యవహరించిందని అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ్మ శర్మ కోర్టుకు తెలిపారు. కేటాయింపు సమయంలో కేవలం ప్రత్యూష్ సిన్హా కమిటి నిర్దేశకాలను పరిగణలోకి తీసుకున్నారని ర్యాంకు, స్థానికత, రిజర్వేషన్, పదోన్నతి వంటి విషయాలను పట్టించుకోలేదని పిటీషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. సివిల్స్ ద్వారా ఎంపికైన వారికి పదోన్నతుల ద్వారా వచ్చిన అధికారులను ఒకే విధంగా పరిగణించి కేటాయింపులు చేశారని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం క్యాట్ ఉత్తర్వులను కొట్టేసింది.

దిశ కేసులో పోలీసుల వాదనలు వినడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

CAT Orders in IAS Officers : అఖిల భారత సర్వీస్ అధికారుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న క్యాట్‌ కేటాయింపులకు సంబంధించి నేరుగా ఉత్తర్వులు ఇవ్వకుండా కేంద్రానికి సూచనలు చేసి ఉండాల్సిందని ధర్మాసనం అభిప్రాయపడింది. అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపు కేవలం డీఓపీటీ(DOPT) పరిధిలో మాత్రమే ఉంటుందని పేర్కొంది. కేటాయింపులపై అభ్యంతరాలున్న అఖిల భారత సర్వీస్ అధికారులు మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేసుకోవాలని సూచించింది. కేటాయించిన రాష్ట్రాల్లో పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న విషయాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని ఒక్కో అధికారి వ్యక్తిగత అంశాలను పరిశీలించిన తర్వాతే తిరిగి కేటాయింపులు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Telangana HC Order IAS Officers Case : డీఓపీటీ కేటాయింపులు జరిపిన వెంటనే బదిలీ జరగకుండా కొన్ని రోజుల సమయం ఇవ్వాలని పిటీషనర్లు తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. ఏపీకి కేటాయించినా తెలంగాణలో కొనసాగుతున్న మాజీ డీజీపీ అంజనీ కుమార్, అదనపు డీజీ అభిలాష బిస్త్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, వాకాటి కరుణతో పాటు ఇతర అధికారులున్నారు. తెలంగాణకు కేటాయించినా ఏపీలో కొంతమంది అధికారులు కొనసాగుతున్నారు. వీళ్లంతా కేటాయింపులపై కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేసుకోనున్నారు.

'వ్యూహం' సినిమా విడుదలపై అక్కడే తేల్చుకోండి - పిటిషనర్​కు స్పష్టం చేసిన హైకోర్టు

Telangana High Court : తొలి తెలుగు తీర్పుతో.. హిస్టరీ క్రియేట్ చేసిన తెలంగాణ హైకోర్టు

Last Updated :Jan 3, 2024, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details