తెలంగాణ

telangana

Dalit Bandhu In Telangana : దళితబంధు రెండో విడత అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

By

Published : Jun 24, 2023, 9:16 PM IST

Updated : Jun 24, 2023, 10:16 PM IST

kcr
kcr

21:09 June 24

Dalit Bandhu In Telangana : రెండో విడత దళిత బంధులో.. 1.30 లక్షల కుటుంబాలకు ఆర్థికసాయం

Second Phase Dalit Bandhu In Telangana : దళిత బంధు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దళిత బంధు రెండో విడత ఆర్థిక సాయానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్​ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. రెండో విడతలో 1.30 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని.. లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికైనా దళిత బంధుపై విపక్షాలు విమర్శలు మానాలి : దళిత బంధు రెండో విడత ఉత్తర్వులు జారీపై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ హర్షం వ్యక్తం చేశారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఇకనైనా దళిత బంధుపై విపక్షాలు విమర్శలు మానుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్​ విపక్షాలకు సలహా ఇచ్చారు. సీఎం కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు.

హుజురాబాద్​లో దళిత బంధు పథకం ప్రారంభం :దళిత బంధును హుజురాబాద్​ ఉపఎన్నిక సమయంలో ఆ నియోజవర్గంలో సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ఆ ప్రాంతంలో 14,400 మంది ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.10లక్షలు చొప్పున రూ.500 కోట్లను నేరుగా వారి ఖాతాల్లోకి ప్రభుత్వం నగదును జమ చేసింది. అణగారిన దళిత జాతి సమగ్ర అభ్యుదయానికి తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్ర బడ్జెట్​ 2023-24లో రూ.17,700 కోట్లను దళిత బంధు నిధుల కింద కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దళితులు ఆ సంపదను పెట్టుబడిగా పెట్టుకొని.. ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తుంది.

Telangana Dalita Bandhu Budget 2023-24 : దళిత జాతి స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్​ దళితబంధు పథకానికి నాంది పలికారు. అందులో భాగంగా ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షలు ఆర్థిక సాయం చేసి.. వారి పురోగతిని చూడాలని సంకల్పించారు. వారు ఆ నగదుతో వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టి లాభదాయక వ్యాపారం చేసి.. అందరితో సమానంగా ఉండాలని సీఎం కేసీఆర్​ కోరుకున్నారు.

Dalit Bandhu Scheme in Telangana : తొలి విడతలో దళిత బంధు కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 గ్రామాలను ఎంపిక చేసి.. వారిలో కొంత మందికి దళిత బంధును ప్రకటించారు. వారిలో 206 యూనిట్లకు రూ.20.06 కోట్లు మంజూరు చేశారు. 90 మంది వస్తు సామగ్రి విక్రయాలు, 58 మంది పశుపోషణ, 54 మంది చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపన, నలుగురు చేపల పెంపకం, రవాణా రంగాలను లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నారు. కోళ్లఫారం, చేపల పెంపకం, రైస్​ మిల్లు, పెట్రోల్​ పంపు వంటి వాటితో ఆర్థికంగా బలపడేందుకు అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ దళితులంతా మరో పది మందికి ఉపాధిని కల్పించే స్థాయికి ఎదిగారని.. మంత్రి కేటీఆర్​నే స్వయంగా ఆనందం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి :

Last Updated : Jun 24, 2023, 10:16 PM IST

ABOUT THE AUTHOR

...view details