Dalit Bandhu Cash Misuse: ప్రైవేటు ఖాతాల్లోకి దళితబంధు నిధులు.. దాదాపు 15 రోజులకు..!

author img

By

Published : May 13, 2022, 5:11 AM IST

Dalit Bandhu Cash Misuse

Dalit Bandhu Cash Misuse: దళిత బంధు నిధులు ప్రైవేటు ఉద్యోగుల ఖాతాల్లోకి బదిలీ అయిన సంఘటన కాస్త ఆలస్యంగా బయటకొచ్చింది. హైదరాబాద్​లోని లక్డీకపూల్‌ ఎస్బీఐ సిబ్బంది తప్పిదంతో ఇతరుల ఖాతాల్లోకి బదిలీ అయినట్లు తేలింది. నగదు బదిలీని 15 రోజుల తరువాత బ్యాంకు అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

లబ్దిదారులకి కాకుండా ప్రైవేట్‌ ఉద్యోగుల ఖాతాల్లోకి దళిత బంధు నిధులు వెళ్లిన విషయం ఆలస్యంగా బయటకొచ్చింది. క్లరికల్‌ సమస్య వల్ల ఇతరుల ఖాతాల్లో జమకావడంతో ఆ నిధులను తిరిగి ఇవ్వకుండా ఖర్చుపెట్టుకున్నాడని ఓ వ్యక్తిపై ఎస్​బీఐ మేనేజర్ ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. గత నెల26న ఎస్సీ కార్పొరేషన్ దళిత బందు నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలంటూ లక్డీకాపూల్లోని రంగారెడ్డి జిల్లా ఎస్బీఐ కలెక్టరేట్ శాఖకి రూ.7 కోట్ల 44 లక్షలు బదిలీ చేసింది.

అందులో 15 మంది లబ్ధిదారులకు చేరాల్సిన నిధులు క్లరికల్ తప్పిదంతో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి చెందిన 15 మంది ఉద్యోగుల ఖాతాల్లోకి వెళ్లాయి. తప్పిదాన్ని గ్రహించి విచారణ చేసిన బ్యాంకు సిబ్బంది 14 మంది నుంచి సొమ్ము రికవరీ చేశారు. ఓ ఉద్యోగి మాత్రం 9 లక్షల 90 వేలు వాడుకున్నాడు. ఈ మేరకు బ్యాంక్ మేనేజర్ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: Dalit Bandhu Scheme: దళితబంధు పథకంలో పరిశ్రమల ఏర్పాటు

CM KCR on Dhalitabandhu: 'దళితబంధు దేశానికి, ప్రపంచానికే ఆదర్శం కాబోతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.