తెలంగాణ

telangana

పల్లెలు, పట్టణాల అభివృద్ధి.. మెరుగైన పౌర సేవలే లక్ష్యంగా బడ్జెట్ 2023-24

By

Published : Feb 6, 2023, 8:31 PM IST

TS Budget Allocations 2023: పల్లెలు, పట్టణాల అభివృద్ధితోపాటు పచ్చదనాన్ని మరింత పెంచే దిశగా ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపులు చేసింది. స్థానిక సంస్థల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి, హైదరాబాద్‌లో ట్రాఫిక్‌, తాగునీటి సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారంపై దృష్టి సారించింది. సొంతజాగాల్లో ఇళ్లనిర్మాణానికి ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు.

TS Budget Allocations 2023
TS Budget Allocations 2023

తెలంగాణ బడ్జెట్ 2023-24

TS Budget Allocations 2023: స్థానిక సంస్థలు స్వతంత్రంగా నిధులు వినియోగించుకునేలా.. పల్లె, పట్టణ ప్రగతి నిధులతో పాటు ఆర్థిక సంఘం నిధులను నేరుగా ఖాతాల్లో బదిలీ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. పంచాయతీరాజ్‌ శాఖకు ఈ పద్దులో రూ. 31,426 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల విస్తరణకు రూ.2,500 కోట్లు ప్రతిపాదించారు. తెలంగాణ పల్లెలు సాధించిన ప్రగతితో పోల్చితే దేశంలోని ఏ రాష్ట్రం దరిదాపుల్లో లేదన్న మంత్రి.. ప్రభుత్వ చర్యలతో గ్రామాల్లో ప్రజారోగ్యం ఎంతో మెరుగుపడిందని చెప్పారు.

పురపాలక సంఘాలను బలోపేతం చేసి.. పట్టణాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనంతో పాటు మెరుగైన పౌర సేవలందిస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. పురపాలికలు, నగర పాలికల్లో మార్కెట్లు, వైకుంఠదామాలు, తాగునీటి సరఫరాతో పాటు పట్టణాల అభివృద్ధికి ఈ బడ్జెట్‌లో రూ.11,372 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఎస్​ఆర్​డీపీతో హైదరాబాద్ ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరిస్తున్నామన్న హరీశ్‌రావు.. రూ.6,250 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వచ్చే మూడేళ్లలో ఎయిర్‌పోర్ట్‌ మెట్రో పూర్తి చేస్తామన్నారు. శంషాబాద్‌ విమానాశ్రయ విస్తరణ పనులు జూన్‌లోపు పూర్తి కానున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ పరిధిలో 67,782 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందన్న ఆయన.. మరో 32 వేల 218 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందన్నారు. సొంత జాగాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ సాయం కింద రూ.7,890 కోట్లు ప్రతిపాదించారు. మొత్తంగా పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తున్నట్లు తెలిపారు.

''సొంత జాగాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ సాయం కింద రూ.7,890 కోట్లు ప్రతిపాదించాం. హైదరాబాద్‌ పరిధిలో 67,782 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. మరో 32 వేల 218 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. రూ.6,250 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వచ్చే మూడేళ్లలో ఎయిర్‌పోర్ట్‌ మెట్రో పూర్తి చేస్తాం.'' - హరీశ్​రావు, ఆర్థికశాఖ మంత్రి

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాటలు..: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం బాటలు వేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు వివరించారు. పాలనా సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు మేరకు ఇప్పటికే 17 కలెక్టరేట్ల నిర్మాణం పూర్తయ్యిందన్న ఆయన.. మరో 11 సమీకృత భవనాల నిర్మాణం కొనసాగుతున్నట్లు తెలిపారు. నూతన సచివాలయం ఈ నెల 17న ప్రారంభానికి ముస్తాబవుతోందని.. రూ.178 కోట్లతో చేపట్టిన అమరవీరుల స్మృతి వనం కూడా ప్రారంభానికి సిద్ధమైందని తెలిపారు. స్థానిక సంస్థల కృషితో తెలంగాణ పచ్చదనంతో పరిఢవిల్లుతుందన్న మంత్రి.. అటవీ శాఖ, హరితహారం కార్యక్రమాలకు ఈ బడ్జెట్‌లో రూ.1,471 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.

ఇవీ చూడండి..

పంచాయతీరాజ్​కు రూ.31,426 కోట్లు.. పట్టణశాఖకు రూ.11,372 కోట్లు

మెట్రోరైలు అభివృద్ధికి భారీగా నిధులు.. బడ్జెట్​లో ఎంత కేటాయించారంటే?

ABOUT THE AUTHOR

...view details