ETV Bharat / state

పంచాయతీరాజ్​కు రూ.31,426 కోట్లు.. పట్టణశాఖకు రూ.11,372 కోట్లు

author img

By

Published : Feb 6, 2023, 4:37 PM IST

Telangana Budget 2023: రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్​లో గ్రామీణాభివృద్ధి, పురపాలకశాఖలకు భారీ మొత్తంలో కేటాయింపులు చేసింది. గ్రామీణాభివృద్ధికి రూ.31,426 కోట్లు కేటాయిస్తే, పురపాలకశాఖకు రూ.11,372కోట్లును కేటాయించారు. రాష్ట్ర బడ్జెట్​ మొత్తం రూ.2,90,396 కోట్లు కాగా అందులో ఈ రెండింటికి సుమారు 44,500కోట్లు కేటాయింపులు చేశారు.

budget
బడ్జెట్

Allocations For Rural And Urban Departments In Budget: నేడు శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్​ను రూ. 2,90,396 కోట్లుగా ప్రకటించారు. ఈ కేటాయింపుల్లో పంచాయతీ రాజ్​, పురపాలకశాఖలకు బడ్జెట్​లో అధిక మొత్తంలో కేటాయించామని మంత్రి హరీశ్​రావు తెలిపారు. ఏ సంవత్సరం లేనంతగా గ్రామీణాభివృద్ధికి బడ్జెట్​లో పెద్దపీట వేశారు.

పంచాయతీ రాజ్​కు అధిక కేటాయింపులు: పంచాయతీ రాజ్​కు కేటాయింపులను చేస్తూ ఆర్థిక మంత్రి హరీశ్​రావు ఈ విధంగా పేర్కొన్నారు. ఈ వార్షిక బడ్జెట్​లో రూ.31,426కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి నిధులతోపాటు, ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా స్థానిక సంస్థల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేయాలని ఆర్థికశాఖ మంత్రి వెల్లడించారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఫైనాన్స్, ట్రెజరీల ఆమోదం కోసం వేచి చూడకుండా, స్వతంత్రంగా నిధులు వినియోగించుకోవచ్చు అన్నారు.

రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రూ.238 కోట్లతో ఆహ్లాదకరమైన పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామని హరీశ్​రావు తన ప్రసంగంలో తెలిపారు. 9243 కిలోమీటర్ల మేర రహదారులకు ఇరువైపులా మొక్కలను నాటి సంరక్షిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు రూ.4,209కోట్లతో 8,160 కి.మీల రోడ్ల నిర్మాణం చేపట్టిందని శాసనసభా సాక్షిగా చెప్పారు. దెబ్బతిన్న పంచాయతీరాజ్ పాత రోడ్ల మరమ్మతులు, నిర్వహణ కోసం బడ్జెట్లో రూ.2 వేల కోట్లు ప్రతిపాదించడమైనదని పేర్కొన్నారు.

"మరణించినవారి అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేందుకు రూ.1330 కోట్లతో అన్నిగ్రామాల్లో వైకుంఠ ధామాలను నిర్మించాము. రూ.279 కోట్లతో ప్రతి ఊరికీ ఒక డంప్ యార్డును ఏర్పాటు చేశాము. ’’ -హరీశ్​రావు, ఆర్థికశాఖ మంత్రి

పురపాలక శాఖకు నిధులు: రోజురోజుకూ పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పించడంపై తెలంగాణ ప్రభుత్వం విశేషంగా దృష్టి సారించిందని హరీశ్​రావు పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలతో పురపాలక సంఘాలు ఆర్థికంగా బలపడి.. పరిపాలనా సామర్థ్యాన్ని పెంచుకున్నాయని కొనియాడారు. ఇందుకు రూ.11,372కోట్ల నిధులను ఈ బడ్జెట్​లో కేటాయించారు.

పట్టణ ప్రగతి కింద రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు, హైదరాబాద్ సహా ఇతర మున్సిపల్ కార్పొరేషన్లకు ఇప్పటివరకు ప్రభుత్వం రూ.3855 కోట్ల నిధులిచ్చిందని మంత్రి చెప్పారు. ఈ పథకం ద్వారా పట్టణాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం, మెరుగైన పౌర సేవలు అందించడం జరుగుతుందన్నారు.

"ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 144 సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాన్ని రూ.522 కోట్లతో చేపట్టిందని వివరించారు. శ్మశానాలను ఆధునిక వసతులతో వైకుంఠ ధామాలుగా మార్చేందుకు ఇప్పటికే రూ.346 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అర్బన్ మిషన్ భగీరథ కింద 141 మున్సిపాలిటీల్లో రూ.6578 కోట్లతో ఇంటింటికీ సురక్షిత తాగునీటి జలాలను అందించే పథకాన్ని చేపట్టి 103 మున్సిపాలిటీల్లో పనులు పూర్తి చేసి తాగు నీరు అందిస్తున్నామని తెలిపారు." -హరీశ్​రావు, ఆర్థికశాఖ మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.