తెలంగాణ

telangana

Telangana BJP Meeting in Hyderabad Today : బీజేపీ కీలక సమావేశం.. ఎన్నికలు, తెలంగాణ విమోచన దినోత్సవంపై చర్చ

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2023, 8:13 AM IST

Telangana BJP Meeting in Hyderabad Today : శాసనసభ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్న వేళ.. నేడు బీజేపీ కీలక సమావేశం జరగనుంది. ఎన్నికలకు సన్నద్ధత, అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్య నేతలు చర్చించనున్నారు. మరోవైపు పార్టీ టికెట్ల కోసం మరో 333 మంది దరఖాస్తు చేసుకోగా మొత్తం సంఖ్య వెయ్యికి చేరువైంది.

BJP
Telangana BJP Meeting in Hyderabad Today

Telangana BJP Meeting in Hyderabad Today బీజేపీ కీలక సమావేశం.. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహంపైనే ప్రధాన చర్చ

Telangana BJP Meeting in Hyderabad Today : రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్​ఎస్(BRS)​ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు బీజేపీ(BJP) భారీ ఎజెండాతో కీలక సమావేశం(BJP Meeting) నిర్వహించనుంది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి ప్రకాశ్‌ జావ్‌డేకర్, రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జి సునీల్‌ బన్సల్ సహా.. ముఖ్యనేతలు డీకే అరుణ, లక్ష్మణ్‌తోపాటు రాష్ట్ర పదాధికారులు, జిల్లాల అధ్యక్షులు, ఇన్‌ఛార్జులు హాజరవుతారు.

ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికతో పాటు అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నట్లు సమాచారం. కార్యాచరణపై జిల్లాల అధ్యక్షులు, ఇన్‌ఛార్జులకు దిశానిర్దేశం చేస్తారని, ఇటీవల ముగిసిన ఎమ్మెల్యేల ప్రవాస్‌ యోజన కార్యక్రమంపైనా సమీక్షిస్తారని తెలిసింది. జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ స్థితిగతులు, త్వరలో నిర్వహించనున్న బస్సుయాత్ర, ఓటరు జాబితాల పరిశీలన తదితర అంశాలపై సమగ్రంగా చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తూ గురువారం మరో 333 మంది బీజేపీ నేతలు దరఖాస్తు చేసుకున్నారు. మరో మూడు రోజుల్లో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుండగా.. గురువారం వరకు మొత్తం 999 అర్జీలు సమర్పించారు.

Telangana Assembly Election BJP Action Plan : హైదరాబాద్‌లో ఈ నెల 17న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లలో ఎవరో ఒకరు పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. తొలుత అమిత్‌షా హాజరవుతారని భావించినా జాతీయ కార్యక్రమాల నేపథ్యంలో మార్పులకు అవకాశం ఉందని పార్టీ నేతలు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇది అత్యంత ముఖ్యమైన కార్యక్రమంగా బీజేపీ నాయకత్వం భావిస్తోంది. అధికారిక కార్యక్రమం కావడంతో అమిత్‌షా లేదంటే రాజ్‌నాథ్‌సింగ్‌ వస్తారని, జీ-20 సమావేశాల అనంతరం స్పష్టత వస్తుందన్నారు.

BJP's Strategic Steps on the Candidates List : అభ్యర్థుల ఎంపికపై ఇప్పుడేం తొందర.. వచ్చేనెలంతా ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ హైకమాండ్ ఆదేశం

Telangana BJP Focus on Assembly Election : ఈ సమావేశంలో ప్రధానంగా మేరా మాటి- మేరా దేశ్ కార్యక్రమ యోజన వంటి కార్యక్రమాలపై సమీక్ష, ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ డ్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సమ్మెళనాలపై సమీక్ష నిర్వహించాల్సిన వాటిపై చర్చించనున్నారు. త్వరలో జరిగే పార్టీ వాహన యాత్ర ఏర్పాట్లపై సమీక్ష, మోదీ జన్మదినమైన సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు 15 రోజుల సేవాపక్షం సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై, ఆయుష్మాన్ భారత్ కార్డు జారీపై చర్చించనున్నారు. సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి సందర్భంగా కేంద్రప్రభుత్వం 18 కులవృత్తి వారికి లబ్ధిచేకూర్చే పథకం గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశాలపై దిశా నిర్దేశం చేయనున్నారు.

Amit Shah Telangana Tour : సెప్టెంబర్ 17న తెలంగాణకు అమిత్ షా

BJP Assembly Constituency Level Committee Meeting : 'బీజేపీ కార్యకర్తలు.. కేసీఆర్​ మైండ్​ గేమ్​ ట్రాప్​లో పడొద్దు'

ABOUT THE AUTHOR

...view details