ETV Bharat / state

Telangana BJP 2023 Elections Plan : 'పార్టీ బలహీనంగా ఉన్న చోట త్వరితగతిన బలోపేతం చేయాలి'

author img

By

Published : Aug 11, 2023, 10:14 PM IST

Telangana BJP 2023 Elections Plan : వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా నేడు బీజేపీ కోర్​ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

BJP Telangana Election Plan 2023
Telangana BJP Core Commitee Meet On Hyderabad

Telangana BJP 2023 Elections Plan : శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ కోర్‌ కమిటీ సమావేశమైంది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించింది. అమీర్ పేటలోని ఆదిత్య హోటల్‌లో కిషన్‌ రెడ్డి అధ్యక్షతన కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జీ ప్రకాశ్‌ జావడేకర్‌, రాష్ట్ర ఇంఛార్జీలు తరుణ్ చుగ్‌, సునీల్‌ బన్సల్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట త్వరితగతిన బలోపేతం చేయాలని అందుకు సంబంధించిన కార్యాచరణపైన ఈ సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ముంగిట పార్టీని ఎవరైనా నేతలు వీడితే తీవ్ర నష్టం వాటిల్లుతుంది కావున అప్రత్తమంగా ఉండటంతో పాటు అభ్యర్థులు లేని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లోని జన, ధన బలం ఉన్న నేతలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు ఆపరేషన్ ఆకర్ష్(BJP Operation Akarsh in Telangana)​కు పదును పెట్టాలని జాతీయ నేతలు దిశానిర్దేశం చేశారు. చేరికలకు సంబంధించిన వ్యవహారంలో అవసరమైతే తాము రంగంలోకి దిగుతామని చెప్పినట్లు సమాచారం.

BJP High Command Serious on TS Leaders : రాష్ట్ర బీజేపీలో కల్లోలం.. ఆ నేతలపై హైకమాండ్‌ సీరియస్‌

BJP Telangana Election Plan 2023 : సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ఎన్నికలకు సమాయత్తంపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. పాత, కొత్త కలయికతో నేతలు సమన్వయంతో పని చేసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు దోహదం చేయాలని ఆదేశించారు. ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని.. అందుకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. కేసీఆర్‌ విస్మరించిన ఎన్నికల హామీలతో పాటు వివిధ వర్గాలను మోసం చేసిన తీరుపై క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. మేరీ మాటి మేరా దేశ్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Raghunandan Rao Latest Comments : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నేను అర్హుడిని కానా?: రఘునందన్‌రావు

Telangana assembly election BJP Operation Akarsh : ఆగస్టు 13న ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో కనీసం 1000 మందితో దేశ భక్తి పాటలతో తిరంగా యాత్ర నిర్వహించాలని జాతీయ నేతలు ఆదేశించారు. ఆగస్టు 14న దేశ విభజన గాయాల స్మృతిదినం జిల్లా కేంద్రంలో మౌన ప్రదర్శన, ఫొటోలు, వీడియోల ప్రదర్శన నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు. ఆగస్టు 15న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపైన, కార్యాలయంపైన, కూడలిలో జాతీయ జెండా ఎగుర వేయడం, జాతీయ గీతాలాపన చేయాలని సమావేశంలో నిర్ణయించారు. రెండు పడకగదుల ఇళ్లు, దళితబంధు, బీసీ బంధు, బీసీలకు లక్ష రూపాయలు, గృహలక్ష్మీ, ధరణి సమస్యలపై పోరాటం చేయాలని.. బీజేపీ ప్రజల్లో విశ్వాసం కలిగేలా పోరాటం చేయాలని జాతీయ నేతలు రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు.

Bandi Sanjay Counter to KTR : 'ట్విటర్ టిల్లు.. దేశం మిమ్మల్ని గమనిస్తోంది..' కేటీఆర్​కు బండి సంజయ్ కౌంటర్

BJP Telangana Election Plan 2023 : 35-40 సీట్లకు ముందే అభ్యర్థులు.. ఎన్నికలకు బీజేపీ పకడ్బందీ వ్యూహాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.