తెలంగాణ

telangana

సైకిల్​ గుర్తును మార్చుకో.. చంద్రబాబుకు తమ్మినేని సీతారాం సూచన

By

Published : Jan 4, 2023, 9:10 PM IST

Tammineni Comments On CBN: ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మార్కెట్ కమిటీ ఆవరణలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్.. సైకిల్‌ను తొలగించి తెలుగుదేశం గుర్తుగా శవాన్ని పెట్టుకోవాలని సూచించారు.

Tammineni
స్పీకర్​ తమ్మినేని సీతారాం

టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన స్పీకర్​ తమ్మినేని సీతారాం

Tammineni Comments On CBN: ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మార్కెట్ కమిటీ ఆవరణలో అధికారులు నిర్వహించిన కొత్త పింఛన్ పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. నీవల్ల రాష్ట్రానికి శని పట్టిందని.. నేను అప్పుడే చెప్పానని 'ఇదేం ఖర్మ రా బాబు మన రాష్ట్రానికి' అని విమర్శించారు. ఎన్టీఆర్ పెట్టిన సైకిల్ గుర్తు మార్చుకోవాలని విమర్శించారు.

"నువ్వు మీటింగ్ పెడితే జనాలు చస్తున్నారు. ఆ మహనీయుడు రామారావు పెట్టిన గుర్తు సైకిల్ గుర్తు. నువ్వు ఇది కాదు పెట్టుకోవలసింది. నువ్వు ఎక్కడెళ్లినా జనం చస్తున్నారు.. అందుకే గుర్తు మార్చుకో.. ఇన్ని రోజులు నీ పార్టీ వెంటిలేటర్ మీద ఉంది. ఆ వెంటిలేటర్​ని ప్రజలు పీకేశారు. ఈ రాష్ట్రానికి పట్టిన ఖర్మ, శని వదిలించుకుంటాం." -తమ్మినేని సీతారాం, ఏపీ స్పీకర్​

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details