తెలంగాణ

telangana

పర్యావరణ పరిరక్షణకై సీడ్​ గణేశ్​ విగ్రహాల వితరణ

By

Published : Aug 21, 2020, 6:22 PM IST

పర్యావరణ పరిరక్షణకై చెట్ల పెంపకంతోపాటు సీడ్​ వినాయక విగ్రహాలను గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​ నిర్వాహకులు పంపిణీ చేశారు. కరోనా కట్టడికై ముందు వరుసలో ఉండి అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు హైదరాబాద్​ అబిడ్స్​ ఫంక్షన్​హాల్లో గణేశ్​ ప్రతిమలను ఎంపీ సంతోష్​కుమార్, టీఎస్​ఐఐసీ ఛైర్మన్​, ​ వితరణ చేశారు.

seed-ganesh-statues-distributed-by-mp-joginpally-santosh-kumar-in-hyderabad-abids
పర్యావరణ పరిరక్షణకై సీడ్​ గణేశ్​ విగ్రహాల వితరణ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకలు... ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సౌజన్యంతో హైదరాబాద్ అబిడ్స్ ఫంక్షన్ హాల్లో మూడు వందల సీడ్ గణేష్ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ... చెట్ల పెంపకంతోపాటు మట్టి విగ్రహాల వితరణకి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్​ కుమార్ కృషిని టీఎస్ఐఐసీ ఛైర్మన్ బాలమల్లు అభినందించారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం... కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు తమతమ ఇళ్లలోనే గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించుకోవాలని సూచించారు. కొవిడ్​ కష్టకాలంలో విశేషంగా సేవలు అందిస్తున్న... వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు... సీడ్ వినాయక విగ్రహాలను అందజేయండంతో పాటు వారిని పూలతో ఘనంగా సన్మానించిందుకు... బాలమల్లు, క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి:గుడారాల్లో పెరిగింది... నాయకత్వ పాఠాలు చెబుతోంది!

ABOUT THE AUTHOR

...view details