తెలంగాణ

telangana

ముగిసిన సంక్రాంతి సెలవులు - హైదరాబాద్​కు తిరుగుపయనంలోనూ తిప్పలే

By ETV Bharat Telangana Team

Published : Jan 17, 2024, 1:56 PM IST

Sankranti Rush in Telangana 2024 : సంక్రాంతి పండగ సందర్బంగా సొంతూళ్లకు వెళ్లిన వారికి తిరుగు ప్రయాణంలోనూ తిప్పలు తప్పడం లేదు. రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు మంగళవారం తెల్లవారుజాము నుంచే తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి. దీంతో బస్సులన్నీ రిజర్వేషన్లతో నిండిపోయాయి. జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలకు ఆటంకం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Sankranti Festival Effect 2024
Sankranti Rush in Telangana 2024

Sankranti Rush in Telangana 2024: సంక్రాంతి పండుగకి సొంత గ్రామాలకు వెళ్లిన పట్టణ వాసులంతా సెలవులు ముగియడంతో తిరిగి పట్టణం వైపు ప్రయాణమయ్యారు. తెలంగాణలోని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు మంగళవారం నుంచే తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి. ఒక్కసారిగా నగరానికి వస్తున్న ప్రయాణికులతో ఊర్లలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి.

Sankranti Return journey Huge Rush Telangana : మరోవైపు ఆంధ్రా నుంచి వచ్చే ప్రయాణికులతో హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ గేట్ వద్ద హైదరాబాద్ వైపుగా వేలాది వాహనాలు వస్తున్నాయి. ప్రతి వాహనానికి ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్ ఉండడంతో ట్రాఫిక్​కు ఇబ్బంది లేకుండా టోల్ గేట్ దాటి వెళ్తున్నాయి.

సంక్రాంతి పండగకు సొంత గ్రామాలకు వెళ్లే క్రమంలో జాతీయ రహదారి చౌటుప్పల్ వద్ద పెద్ద ఎత్తున వాహనాలు జామ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రాపిక్ పోలీసులు ముందస్తుగా ఊర్ల నుంచి వచ్చే వాహనాలను దృష్టిలో ఉంచుకొని జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలకు ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో ట్రాఫిక్ జామ్ కాకుండా సజావుగా సాగుతుంది.

టోల్​గేట్ ఛార్జీలు, ట్రాఫిక్ తప్పించుకోవాలా? సంక్రాంతి రిటర్న్ జర్నీలో ఇలా చేయండి

రాష్ట్రంలో పాఠశాలలు 18 నుంచి తిరిగి ప్రారంభం అయ్యాయి. దీంతో సొంతూళ్లకు వెళ్లినవారిలో అత్యధికులు ఈ రోజు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని స్వస్థలాలకు వెళ్లినవారి రద్దీ బుధవారం నుంచి ఎక్కువగా ఉండనుంది. ఖమ్మం, భద్రాచలం, కోదాడల నుంచి వచ్చే బస్సుల్లో బుధవారం దాదాపు రిజర్వేషన్లన్నీ పూర్తయ్యాయి. ఏపీలోని విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, భీమవరం, విజయవాడ, నెల్లూరుల నుంచి 17న వచ్చే బస్సుల్లో సీట్లు లేవు. 18న కూడా భారీగా ప్రయాణాలున్నాయి.

Sankranti Rush Leads to Traffic Jam: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారికి తిరుగు ప్రయాణంలోనూ తిప్పలు తప్పడం లేదు. రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు మంగళవారం తెల్లవారుజాము నుంచే తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి. ఖమ్మం, కోదాడ, భద్రాచలం వంటి దూరప్రాంతాల నుంచి సోమవారం అర్ధరాత్రి దాటాక బయల్దేరిన బస్సులు కిక్కిరిశాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే నైట్‌హాల్ట్‌ బస్సులు మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమైన మొదటి రెండు స్టాప్‌లలోనే నిండిపోయాయి.

సంక్రాంతి వేళ టీఎస్​ఆర్టీసీకి కాసుల పంట - ఒక్కరోజే రూ.12 కోట్ల ఆదాయం

Special Buses for Sankranti 2024: తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే సర్వీసుల్లో ఏసీ బస్సుల్లో రిజర్వేషన్లు నిండిపోయాయి. రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు 16, 17 తేదీల్లో బస్సులన్నీ రిజర్వేషన్లతో నిండిపోయాయి. దీంతో ఏపీలోని ఏలేశ్వరం డిపో నుంచి 17న రాత్రి ఎక్స్‌ప్రెస్‌ సర్వీసును ఏపీఎస్‌ఆర్టీసీ నడపనుంది.

గోదావరి, గౌతమి, నారాయణాద్రి, విశాఖపట్నం దురంతో, వందేభారత్‌, శబరి, విశాఖ, గరీబ్‌రథ్‌, జన్మభూమి తదితర రైళ్లలో భారీగా వెయిటింగ్‌ లిస్టు ఉంది. కొన్నిట్లో ‘రిగ్రెట్‌’ అని చూపుతోంది. సికింద్రాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్లే మైసూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో 18, 19 తేదీల్లో వెయిటింగ్‌లిస్ట్‌ గరిష్ఠ పరిమితి కూడా దాటేసింది.

హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు - శిల్పారామంలో ఉట్టిపడిన సంక్రాంతి వైభవం

సంక్రాంతి వేళ టీఎస్​ఆర్టీసీకి కాసుల పంట - ఒక్కరోజే రూ.12 కోట్ల ఆదాయం

ABOUT THE AUTHOR

...view details