ETV Bharat / state

సంక్రాంతి వేళ టీఎస్​ఆర్టీసీకి కాసుల పంట - ఒక్కరోజే రూ.12 కోట్ల ఆదాయం

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 16, 2024, 8:56 AM IST

Updated : Jan 16, 2024, 9:23 AM IST

TSRTC Sankranti Income 2024 : సంక్రాంతి పండుగ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ఈ నెల 13న తేదీన 52లక్షల 78వేల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా ఒక్కరోజే రికార్డు స్థాయిలో 12కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోపక్క జీరో టికెట్లు 9 కోట్లు దాటిపోయినట్లు ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. సంక్రాంతి పండుగ సందర్బంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ప్రయాణాన్ని మహిళలు భారీ సంఖ్యలో వినియోగించుకున్నట్లు ఆర్టీసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

TSRTC Record Income In Sankranti
TSRTC Sankranti Income

సంక్రాంతి వేళ ఆర్టీసీకి కాసుల పంట - ఒక్కరోజే రూ.12 కోట్ల ఆదాయం

TSRTC Sankranti Income 2024 : సంక్రాంతి పండుక వేళ విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించడంతో జనం పెద్దఎత్తున సొంతూళ్లకు వెళ్లిపోయారు. పండుగ పూట ఆర్టీసీ బస్సుల్లో భారీ సంఖ్యలో ప్రయాణించినట్లు యాజమాన్యం వెల్లడించింది. పండుగ సందర్భంగా ఆర్టీసీ 6,261 ప్రత్యేక బస్సులను నడిపించగా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ నెల 13న ఆర్టీసీ బస్సుల్లో 52లక్షల 78వేల మంది ప్రయాణించారు. దీంతో ఆర్టీసీకి 12 కోట్ల పైచిలుకు ఆదాయం సమకూరినట్లు అధికారులు అంచనా వేశారు. ఇటీవలి కాలంలో ఇదే రికార్డ్ ఆదాయం అని చెబుతున్నారు. మహిళలకు మహాలక్ష్మి ఉచిత ప్రయాణం తర్వాత టికెట్ ఆదాయం భారీగా పెరగడం ఇదే తొలిసారి అని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.

TSRTC Record Level Income 2024 : సంక్రాంతి సందర్భంగా గడిచిన మూడు రోజుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిపోయింది. ఈనెల 13న ఒక్కరోజే 1,861 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడిపించింది. ఇందులో 1,127 హైదరాబాద్ సిటీ బస్సులను సైతం ప్రయాణికుల కోసం వినియోగించినట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని సంస్థ ప్రణాళిక వేసింది. కానీ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ నెల 11, 12, 13 తేదీల్లోనే 4,400 ప్రత్యేక బస్సులను నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తంగా 6,261 ప్రత్యేక బస్సులను నడిపినట్లు అధికారులు వెల్లడించారు.

పండగ వేళ షాక్ ఇచ్చిన ఆర్టీసీ - సరిపడా బస్సుల్లేక ప్రయాణికుల అవస్థలు

TSRTC Income During Sankranti Festival 2024 : సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో కేవలం మూడు రోజుల్లోనే కోటీ 50లక్షలకు పైచిలుకు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చినట్లు ఆర్టీసీ యమాజన్యం వెల్లడించింది. ఈ మూడు రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణాన్ని 75లక్షలకు పైగా మహిళలు వినియోగించుకున్నట్లు ఆర్టీసీ అంచనా వేస్తోంది.

మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి ఈ పథకాన్ని వినియోగించుకున్న మహిళలు 10 కోట్లకు చేరుకున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 11న 28 లక్షల మంది, 12న సుమారు 28 లక్షల మంది, 13వ తేదీన సుమారు 31 లక్షల మంది ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నట్లు ఆర్టీసీ లెక్కలు చెబుతున్నాయి. సంక్రాంతికి ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ముందే ఊహించిన ఆర్టీసీ అందుకు తగ్గట్లు ప్రణాళికలు సిద్దం చేసుకుంది.

TSRTC Income For Sankranti 2024 : సంక్రాంతి వేళ రద్దీని పర్యవేక్షించేందుకు ముఖ్యమైన పాయింట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వాటిని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేశారు. వాటిని బస్ భవన్‌లో ఉన్న ముఖ్య అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు సూచనలు, సలహాలు ఇస్తూ వచ్చారు. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లినందునే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది.

ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం వెనకడుగు - అమలు చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో జగన్

మహిళలకు ఉచిత ప్రయాణంపై ఆర్టీసీ నివేదిక - సంక్రాంతి కానుకగా డోర్ డెలివరీ​ సేవలు

Last Updated : Jan 16, 2024, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.