తెలంగాణ

telangana

Sagar Left Canal : నేటి నుంచి సాగర్ ఎడమ కాల్వకు నీళ్లు

By ETV Bharat Telangana Team

Published : Oct 6, 2023, 8:45 AM IST

Updated : Oct 6, 2023, 9:04 AM IST

Sagar Left Canal : నేటి నుంచి సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సరైన వర్షాలు కురవకపోవడంతో వేసిన వరి పంట దెబ్బతినే ప్రమాదం ఉందని పలు విజ్ఞప్తులు రావడంతో.. దీనిపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో వరి పొలాలకు సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న వరి పొలాలకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు.

Telangana Government Decides Release Water to Sagar Left Canal
Telangana Government

Sagar Left Canal : ఇవాళ్టి నుంచిసాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల చేయాలని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR) నిర్ణయించారు. నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని నాగార్జునసాగర్(Nagarjuna Sagar) ఆయకట్టు కింద సరైన వర్షాలు కురవకపోవడం వల్ల.. వేసిన వరి పంట దెబ్బతినే ప్రమాదం ఉందని ఆ ప్రాంతాల రైతులు, శాసనసభ్యులు, మంత్రులు గత నాలుగైదు రోజుల నుంచి కేసీఆర్‌కు పలు విజ్ఞప్తులు చేస్తున్నారు.

Nagarjuna Sagar Left Canal Water Release Today :ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ(Irrigation Department) ఉన్నతాధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో సాగర్ ఎడమ కాలువ(Sagar Left Canal) కింద వరి పంటలకు సాగునీరు అందించే విషయంపై చర్చించారు. తెలంగాణ వాటా కింద కృష్ణా జలాలలో మన నీరు ఉన్న నేపథ్యంలో.. ఇవాళ్టి నుంచి నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న వరి పొలాలకు నీటిని విడుదల చేయాలని సీఎం నిర్ణయించారు. మరో 20 రోజుల తర్వాత మరో తడి కోసం.. నీటిని విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

Water Release to Sagar Left Canal From Today :వానలు లేక, సాగర్ రిజర్వాయర్​లో ఆశించిన మేరకు నీటి నిల్వలు లేని కారణంగా.. సాగునీటిని ఒడుపుగా పొదుపుగా వాడుకొని వరి పంటను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి రైతులకు పిలుపునిచ్చారు. సాగర్ ఎడమ కాలువ నీళ్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో.. ఆయా జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాలలో పర్యవేక్షిస్తూ.. రైతుల చివరి పొలాలకు, చివరి ఆయకట్టు దాకా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.

Sagar Left Canal Farmers Problems : బోరు పోయదు.. కాలువ పారదు.. నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు.. ఆవేదనలో అన్నదాతలు

Paddy Crop Damage in khammam :మరోవైపు ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు(Nagarjuna Sagar Dam) పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సీజన్ అనుకూలిస్తుందని కొండంత ఆశతో సాగర్ ఆయకట్టులో పంటలు సాగుచేసిన కర్షకులకు.. కన్నీళ్లే మిగులుతున్నాయి. ముఖం చాటేసిన వానలకు తోడు వెలవెలబోతున్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల లేకపోవడంతో పంటల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. సాగునీరందక పొట్టదశలో ఉన్న వరి పంటలు(Paddy) ఎండిపోతూ.. రైతు కంట కన్నీరు పెట్టిస్తున్నాయి.

Water Release to Sagar Left Canal :సీజన్ ఆరంభంలో కొంతమేర వానలు ఊరించడంతో సీజన్ కలిసివస్తుందన్న ఉద్దేశంతో అన్నదాతలు పంటలు సాగు చేశారు. కృష్ణాపరివాహకంలో వర్షాలు సమృద్ధిగా కురిస్తే సాగునీటికి ఇబ్బందులు ఉండవని భావించారు. వీటికి తోడు బోర్లు, బావులు ఉండటంతో పంటలకు ఇబ్బందులు తలెత్తవని కర్షకులు అనుకున్నారు. కానీ.. రైతుల అంచనాలు తలకిందులయ్యాయి. ఆయకట్టు భూముల్లో బిరబిరా ప్రవహించాల్సిన కృష్ణమ్మ.. సందడి లేక పంటలు వెలవెలాబోతున్నాయి. కృష్ణమ్మ కరుణించక పోతుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు. లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టిన పంటలు సాగునీరందక తడారి పోతుంటే.. ఆయకట్టు రైతుల కళ్లల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ఆవేదన రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది. సాగర్ ఎడమ కాలువ క్రింద ఉన్న రైతుల కోసం నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీంతో పంట సాగు రైతులు కాస్త ఉపశమనం కల్పించినట్లైంది.

Paddy Crop Damage in khammam : సాగునీరు లేక పంట పొలాలు వెల వెల.. లబోదిబోమంటున్న కర్షకులు

Less Flow In Sagar Project : వర్షాలు లేక అడుగంటిన సాగర్‌.. ఎండిన సుంకేసుల

Last Updated : Oct 6, 2023, 9:04 AM IST

ABOUT THE AUTHOR

...view details