తెలంగాణ

telangana

ఉచిత ప్రయాణానికి మహిళలకు కీలక సూచన- ఆ కార్డు చెల్లదంటూ స్పష్టం చేసిన సజ్జనార్

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2024, 8:12 PM IST

RTC MD Sajjanar instructions on Free Bus Journey : మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ స్పష్టం చేశారు. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలన్నారు. పాన్‌ కార్డులో అడ్రస్ లేనందునా ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు.

Mahalakshmi Scheme in Telangana
RTC MD Sajjanar instructions on Free Bus Journey

RTC MD Sajjanar instructions on Free Bus Journey : రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం వినియోగించుకోవాలంటే ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జన్నర్ పేర్కొన్నారు. గుర్తింపు కార్డులో సదరు మహిళ ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలన్నారు. పాన్‌ కార్డులో అడ్రస్ లేనందునా అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదు అని స్పష్టం చేశారు.

అలాంటి వారంతా పల్లె వెలుగు బస్సులు ఎక్కండి - మహిళలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ స్పెషల్​ రిక్వెస్ట్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్‌ గుర్తింపు కార్డు ఉన్నా మహాలక్ష్మి పథకంకు వర్తిస్తుందని ఎక్స్ వేదికగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar)​ వెల్లడించారు. ఒరిజినల్‌ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా ఇప్పటికీ కొంత మంది స్మార్ట్​ఫోన్లలో కార్డులు చూపెడుతున్నారని, ఫొటో కాపీలు, కలర్‌ జిరాక్స్​లు చూపిస్తున్నారని ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చిందన్నారు. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోందన్నారు.

Mahalakshmi Scheme in Telangana :ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని, మహిళా ప్రయాణికులందరూ ఒరిజనల్‌ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్​ను తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జన్నర్ విజ్ఞప్తిచేశారు. ఒరిజినల్‌ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్‌ తీసుకోవాలన్నారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందని, ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్‌ తీసుకుని సహకరించాలని సజ్జనార్​ తెలిపారు.

TSRTC Gamyam App : మీ బస్సు ఎక్కడుందోనని ఆగం కాకండి.. ఈ 'గమ్యం'తో చిటికెలో తెలుసుకోండి..

ఎలాగూ ఉచితమే కదా జీరో టికెట్‌ ఎందుకు తీసుకోవడం అని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారని, జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును ఆర్టీసీకీ ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తుందన్నారు. జీరో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తే సంస్థకు నష్టం చేసిన వాళ్లవుతారన్నారు. కాబట్టి ప్రతి మహిళ కూడా జీరో టికెట్‌ను విధిగా తీసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. ఒక వేళ టికెట్‌ తీసుకోకుండా ప్రయాణిస్తూ చెకింగ్​లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుందన్నారు. టికెట్ లేని సదరు వ్యక్తికి రూ.500 జరిమానా విధించే అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధిగా జీరో టికెట్‌ తీసుకుని సంస్థకు సహకరించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు.

మహాలక్ష్మి పథకంతో తెలంగాణ ఆర్టీసీ పుంజుకుంటుంది : సజ్జనార్

ABOUT THE AUTHOR

...view details