తెలంగాణ

telangana

Revanth Reddy Tweet On Power : 'సత్యాగ్రహ దీక్షను నీరుగార్చేందుకే.. ఉచిత విద్యుత్​ అంశం తెరపైకి'

By

Published : Jul 11, 2023, 9:10 PM IST

TPCC Revanth Reddy Comments On Satyagraha Diksha : గాంధీభవన్​లో నిర్వహించే సత్యాగ్రహ దీక్ష అంశాన్ని నీరుగార్చేందుకే.. ఉచిత విద్యుత్​ అంశాన్ని బీఆర్​ఎస్​ లేవనెత్తుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ట్వీట్​ చేశారు. రైతులకు ఉచిత కరెంట్​ ఇవ్వడంలేదన్న విషయం ఏ సబ్​ స్టేషన్​కు వెళ్లిన తెలుస్తోందని అన్నారు. మరోవైపు రైతులకు 24గంటల కరెంట్ ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ విధానమని ఆ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ స్పష్టం చేశారు.

Revanth Reddy
Revanth Reddy

Revanth Reddy Tweet On Free Current : రాహుల్‌గాంధీ అనర్హత వేటుకు నిరసనగా రేపు సత్యాగ్రహ దీక్షకు పిలుపునివ్వడంతో దానిని నీరు గార్చేందుకు ఉచిత విద్యుత్​ అంశంపై ప్రజలను బీఆర్‌ఎస్‌ దృష్టి మరల్చుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. దీంతో బీజేపీకు బీఆర్​ఎస్​ బీ టీం అని మరోసారి బహిర్గతమైందని ట్విటర్​లో విమర్శించారు.

ఈ నెల 12వ తేదీన రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా "సత్యాగ్రహ దీక్ష"కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్న విషయం ఏ సబ్ స్టేషన్‌కు వెళ్లినా తెలుస్తుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సబ్ స్టేషన్ల ముందు నిరనసలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిస్తున్నామని చెప్పారు.

"బీజేపీకి బీఆర్​ఎస్​ బీ టీం అని మరోసారి నిరూపితమైంది. రేపు రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా "సత్యాగ్రహ దీక్ష" పిలుపుని నీరుగార్చాలని, ఉచితవిద్యుత్ పైకి దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తుంది. 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్న విషయం ఏ సబ్ స్టేషన్​కు వెళ్లినా తెలుస్తోంది. తొమ్మిదేళ్లలో విద్యుత్​ సంస్థలకు రూ.60 వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతిని బయటపెట్టిన ఘనుడు కేసీఆర్​నే. ఈ మోసాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలకేంద్రాలలో సబ్ స్టేషన్ల ముందు కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిస్తున్నాం."- రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడమే కాంగ్రెస్​ విధానం : రైతులకు 24గంటల కరెంట్ ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ విధానమని ఆ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ రేవంత్ రెడ్డి మాటలను వక్రీకరిస్తుందని గాంధీభవన్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. 24గంటల కరెంట్‌ వెనుక ఎంత అవినీతి జరిగిందో తమ వద్ద ఆధారాలున్నాయని తెలిపారు.

Madhuyashki Comments On BRS : విద్యుత్ కొనుగోలు అవినీతిలో కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ 24గంటల విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ సర్కారు అవినీతిని వెలికి తీస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ శ్రేణులు అన్ని విద్యుత్ సబ్‌ స్టేషన్‌ల వద్ద ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ఆందోళనలు చేపట్టాలన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత అంశంలో రేపు గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష చేపడతామని తెలిపారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details