తెలంగాణ

telangana

భాగ్యనగరాన్ని వదలని వాన... రికార్డు వర్షపాతం నమోదు!!

By

Published : Jul 29, 2022, 7:55 PM IST

భాగ్యనగరాన్ని వర్షం వదలడం లేదు. మొన్నటి వరదలకు మూసీ హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తింది. వరద ఉద్ధృతి తగ్గుతుంది అనుకునేలోపే గంట పాటు భారీ వర్షం కురిసింది. నగరాన్ని ఆగమాగం చేసి వెళ్లి పోయింది. నగరంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆ వివరాలు... ఇలా...

HEAVY TRAFFIC JAM IN HYDERABAD DUE TO HEAVY RAINS
భాగ్యనగరాన్ని వదలని వాన... రికార్డు వర్షపాతం నమోదు!!

హైదరాబాద్​లో గంటసేపు వర్షం దంచి కొట్టింది. ఒక్కసారిగా సాయంత్రం వాతావరణం మారిపోయింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. మేఘాలకు చిల్లు పడిందా అనే రితీలో వర్షం కురిసింది. ఒక్కసారిగా భారీ వర్షంతో హైదరాబాద్ నగరం అతలకుతలం అయింది. వాహనదారులు, ప్రయాణికులు, నగరవాసులు అందరూ... తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భాగ్యలత, పనామా, హయత్‌నగర్‌ రోడ్లపై భారీగా వాన నీరు చేరింది. రంగంలోకి దిగిన జీహెచ్​ఎంసీ సిబ్బంది... వాహనాలను మళ్లీంచారు.

భాగ్యనగరంలో కురిసిన వర్షపాతం వివరాలిలా...

ప్రాంతం వర్షపాతం
నేరేడ్‌మెట్‌ 9.5 సెం.మీ
ఆనందబాగ్‌ 7.3సెం.మీ
మల్కాజ్‌గిరి 6.7సెం.మీ
తిరుమలగిరి 6.3సెం.మీ
హయత్‌నగర్‌ 6.2సెం.మీ
కుషాయిగూడ 5.9సెం.మీ
భగత్‌సింగ్‌నగర్‌ 5.5సెం.మీ
వెస్ట్ మారేడుపల్లి 5.3సెం.మీ
బేగంపేట 5సెం.మీ

ABOUT THE AUTHOR

...view details