తెలంగాణ

telangana

రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు

By

Published : Oct 7, 2020, 9:11 PM IST

రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Weather Updates
రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు

రాష్ట్రంలో మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

ఆదిలాబాద్‌, కుమురం భీం, నిర్మల్‌, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, సిద్ధిపేట, జనగామ, వరంగల్‌ పట్టణ, గ్రామీణ, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యపేట జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

దక్షిణ కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాలలో 3.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని... ఈ ఉపరితల ఆవర్తనం నుంచి గాంగేటిక్‌ పశ్చిమ బంగా వరకు ఇంటీరియర్‌ ఒడిశా మీదుగా 3.1కి.మీ ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపింది.

దక్షిణ తమిళనాడు నుంచి దక్షిణ కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వరకు రాయలసీమ మీదుగా 0.9 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. ఈ నెల 9న ఉత్తర అండమాన్ సముద్రం దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

24 గంటలలో ఇది మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. తదుపరి ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీరాలలో ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం లేదా సాయంత్రం వాయుగుండంగా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:'సొంత అవసరాలకు బ్యాంకు డబ్బు వాడుకున్న నిందితులు'

ABOUT THE AUTHOR

...view details