తెలంగాణ

telangana

rain in Hyderabad: రాష్ట్రమంతటా విస్తరించిన రుతుపవనాలు.. భాగ్యనగరంలో మళ్లీ వర్షం..

By

Published : Jun 16, 2022, 4:40 PM IST

rain in Hyderabad: రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే 2 రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని అంచనావేసింది. నైరుతి ప్రభావంతో హైదరాబాద్​లో మళ్లీ వర్షం మొదలైంది. కొండాపూర్​ నుంచి కూకట్​పల్లి వరకు, శేరిలింగం పల్లి నుంచి బాలానగర్​ వరకు వర్షం పడుతోంది. వాతావరణ శాఖ నుంచి భారీ వర్ష సూచన హెచ్చరికల నేపథ్యంలో గ్రేటర్ అధికారులు అప్రమత్తమయ్యారు.

వర్షం
వర్షం

rain in Hyderabad: నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్​లో వర్షం పడుతోంది. గ్రేటర్​ పరిధిలోని మాదాపూర్, కూకట్ పల్లి, మేడ్చల్, సూరారం, హైదర్ నగర్, ప్రగతి నగర్, నిజాంపేట్, బాచుపల్లి, కొండాపూర్​లో వర్షం కురుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా వానలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలపై జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. 168 వర్షాకాల అత్యవసర టీమ్​లను ఏర్పాటు చేసిన అధికారులు.. వారిని అలర్ట్​గా ఉండాలని సూచించారు. వరద ముంపు, రోడ్లపై నీటి నిల్వ వంటి ఇబ్బందులు కలిగితే టోల్​ ఫ్రీ నెంబర్ 1912కు కాల్ చేయాలని అధికారులు నగరవాసులకు సూచించారు. వర్షం కురవడంతో చిరు వ్యాపారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రహదారులపై నిలిచిన నీటితో వాహన చోదకులు, పాదచారులకు ఇబ్బందులు తప్పలేదు.

మరోవైపు రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు ఉపరితల ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు సగటు సముద్రమట్టానికి 9మీటర్ల ఎత్తులో కొనసాగుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజలు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు అనేక చోట్ల పడతాయని వాతావరణశాఖ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details