తెలంగాణ

telangana

19న సికింద్రాబాద్‌లో ప్రధాని సభ.. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

By

Published : Jan 10, 2023, 6:58 AM IST

Updated : Jan 10, 2023, 7:07 AM IST

PM MODI TOUR IN TELANGANA: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఈ నెల 19న హైదరాబాద్‌లో ఉదయం 10 గంటల నుంచి వరుస కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఐదు ప్రాజెక్టులకు భూమిపూజ చేసి.. మూడింటిని జాతికి అంకితం చేయనున్నారు. సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

modi tour
మోదీ పర్యటన

మోదీ పర్యటన ఖరారు

PM MODI TOUR IN TELANGANA: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19న హైదరాబాద్‌ రానున్నారు. ఉదయం 10 నుంచి వరుస కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటల నుంచి వరుస కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఐదు ప్రాజెక్టులకు భూమిపూజ చేస్తారు. మూడు ప్రాజెక్టులను జాతికి అంకితం ఇస్తారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటనలో రూ.7000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు భూమిపూజ చేయడంతోపాటు జాతికి అంకితం చేస్తారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

ప్రధాని రాక నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్‌.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. ఏర్పాట్లపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్, డీఆర్‌ఎం ఏకే గుప్తాతో చర్చించారు. అనంతరం సికింద్రాబాద్‌ జింఖానాగ్రౌండ్స్‌ను సందర్శించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో సంజయ్, లక్ష్మణ్‌ సమావేశమై.. ప్రధానికి ఘనస్వాగతం, సభ విజయవంతం అంశాలపై చర్చించారు.

ప్రధాని పర్యటనలో రైల్వేకు సంబంధించి మొత్తం రూ.2400 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌.. బీజేపీ నేతలకు వివరించారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ప్రధాని కార్యక్రమాల్ని 10వ నంబరు ప్లాట్‌ఫారం వైపు ఏర్పాటు చేయనున్నారు. 19న ఉదయం 10 గంటలకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు జెండా ఊపి ప్రధాని ప్రారంభిస్తారని, అనంతరం సికింద్రాబాద్‌ స్టేషన్‌ పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

ఆ తర్వాత 1850 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో చేపట్టనున్న జాతీయ రహదారి విస్తరణ పనులకు, కాజీపేట పీఓహెచ్​ వర్క్‌షాప్‌నకు రిమోట్‌ ద్వారా భూమిపూజ చేస్తారని తెలిపారు. 85 కిలోమీటర్ల సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ డబుల్‌ లైన్‌ను జాతికి అంకితం చేస్తారని.. ఐఐటీ హైదరాబాద్‌లో చేపట్టిన పలు నిర్మాణాలను ప్రారంభిస్తారని వివరించారు. ప్రధాని నవంబరు 12న రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం ఇచ్చారు. రెండు నెలల వ్యవధిలోనే మరోసారి రాష్ట్ర పర్యటనకు రానుండటం, ఈసారి అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును విశాఖపట్నం వరకు పొడిగించారు. తొలుత సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ వరకే అని ప్రకటించారు. విజయవాడ-దువ్వాడ మధ్య ట్రాక్‌ సామర్థ్యం 130 కిలోమీటర్ల గరిష్ఠ వేగానికి తాజాగా పెరగడంతో వందేభారత్‌ను విశాఖపట్నం వరకు పొడిగిస్తూ రైల్వేశాఖ నిర్ణయించింది. మార్గమధ్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

ప్రధానమంత్రి తెలంగాణకు నూతన సంవత్సర కానుకగా వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారని వెల్లడించారు. ఇప్పటికే రూ. 1.4లక్షల కోట్ల వ్యయంతో తెలంగాణలోని జాతీయ రహదారుల నిర్మాణాన్ని కేంద్రం చేపట్టిందని.. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌యోజన కింద గ్రామాలకు పెద్దఎత్తున రోడ్లు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్న బీఆర్​ఎస్​ నాయకులకు ప్రధాని పర్యటనతోనైనా కనువిప్పు కలగాలని కోరుకుంటున్నానని లక్ష్మణ్‌ స్పష్టం చేశారు.

"ప్రధానమంత్రి హోదాలో మోదీ తెలంగాణకు వచ్చి రూ.2400కోట్లలతో సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​ను ఆధునీకరిస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాలకు ధీటుగా ఈ రైల్వేస్టేషన్​ నిర్మాణం జరగనుంది. దీనికి సంబంధించిన పనులకు ప్రధాని ఈనెల 19న శంకుస్థాపన చేస్తారు." -లక్ష్మణ్​, ఎంపీ

ఇవీ చదవండి:

Last Updated : Jan 10, 2023, 7:07 AM IST

ABOUT THE AUTHOR

...view details