తెలంగాణ

telangana

పురిటి నొప్పులు.. గర్భిణీని 10 కి.మీ మోసుకెళ్లారు..!

By

Published : Jan 9, 2021, 3:14 PM IST

మన్యంలో గర్భిణీలకు ఇక్కట్లు తప్పడం లేదు. వైద్య సదుపాయాల కోసం నరకయాతన పడుతున్నారు. ఏపీలోని విశాఖ మన్యంలో సరైన రహదారి లేక నిండు గర్భిణీని డోలీలో మోసుకెళ్లారు గ్రామస్థులు. అయినా అక్కడ అంబులెన్స్ కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈటీవీ సమాచారం ఇవ్వటంతో.. పోలీసులు అంబులెన్స్ ఏర్పాటు చేశారు.

pregnant-women-problems-in-visakha-agency
పురిటి నొప్పులు.. గర్భిణీని 10 కి.మీ మొసుకెళ్లారు

పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణీని... గ్రామస్థులు 10కి.మీ మేర డోలీలో మోసుకుని రహదారి మార్గానికి తీసుకువచ్చిన ఘటన ఏపీ విశాఖ మన్యంలోని జి.మాడుగులలో చోటుచేసుకుంది. రోడ్డు సౌకర్యం లేక కొండల నడుమ అంత దూరం వెళ్లినా... అంబులెన్స్ రాకపోవడంతో స్థానికులు మీడియాకు సమాచారమిచ్చారు.

ఘటనపై ఈటీవీ సకాలంలో పోలీసులకు సమాచారం చేరవేసింది. వారు వెంటనే స్పందించి.. హుటాహుటిన అంబులెన్స్​ను పంపించడంతో ప్రమాదం తప్పింది.

మారుమూల గ్రామాల్లో రహదారులు లేకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని వారు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:ప్రసవానికి 10 నిమిషాల ముందు గర్భిణీ నృత్యం

ABOUT THE AUTHOR

...view details