తెలంగాణ

telangana

Telangana Congress: సిరిసిల్లలో రాహుల్‌ గాంధీ సభ వాయిదా?

By

Published : Jul 18, 2022, 4:11 AM IST

Updated : Jul 18, 2022, 6:17 AM IST

Telangana Congress: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆగస్టు2న నిర్వహించతలపెట్టిన సిరిసిల్ల సభను వాయిదా వేయాలని యోచిస్తోంది. భారీ వర్షాలతో రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సభ నిర్వహించడం సరికాదనే అభిప్రాయం ఆదివారం జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశంలో వెల్లడైంది.

కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ

Telangana Congress: రాష్ట్రంలో ఆగస్టు 2న నిర్వహించతలపెట్టిన సిరిసిల్ల సభను వాయిదా వేయాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం సతమతమవుతున్న సమయంలో నిరుద్యోగ సభ నిర్వహించడం, దానికి పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ రావడం సరికాదనే అభిప్రాయం నిన్న జరిగిన కాంగ్రెస్‌ నేతల సమావేశంలో వెల్లడైంది. ఈవిషయంపై రాహుల్‌ గాంధీతో చర్చించిన తర్వాత సభ వాయిదా నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో వరద బాధితులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి బాధితులకు ఆర్థిక సాయం, మెరుగైన రీతిలో సహాయ కార్యక్రమాలు అందించడానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో జరిగిన తీవ్ర నష్టాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించి రాష్ట్రానికి ఆర్థిక సాయం మంజూరు చేయాలని కోరనున్నట్లు వెల్లడించారు

Last Updated : Jul 18, 2022, 6:17 AM IST

ABOUT THE AUTHOR

...view details