ETV Bharat / entertainment

ఆర్​సీ 15.. పవర్​ఫుల్​గా రామ్​చరణ్​.. వైరల్​గా మారిన వీడియో

author img

By

Published : Jul 17, 2022, 3:19 PM IST

మెగాహీరో రామ్​చరణ్​ తనకు సంబంధించిన ఓ వీడియోను ఇన్​స్టాలో పోస్ట్​ చేశారు. అది ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. ఫ్యాన్స్​ విపరీతంగా లైక్స్​ కొడుతూ, కామెంట్స్​ పెడుతూ ట్రెండ్​ చేస్తున్నారు.

ramcharan workout video viral
రామ్​చరణ్​ వర్కౌట్​ వీడియో వైరల్​

Ramchran Jim video: ఫిట్​నెస్.. ఈ విషయంలో యువ హీరోల నుంచి స్టార్​హీరోల వరకు ఎక్కడా వెనకాడరు. వీరిలో రామ్​చరణ్​ ఒకరు. ఫిట్​నెస్​కు ప్రాధాన్యత ఇచ్చే హీరోల్లో ముందుంటారు. ఎక్కడికెళ్లినా వర్కౌట్స్​ను విడిచిపెట్టని ఈ మెగాహీరో.. 'ధృవ'లో సిక్స్​ప్యాక్​తో కనిపించి ఫ్యాన్​కు ఫిట్​నెస్​ గోల్​ సెట్​ చేశారు. ఇక 'ఆర్​ఆర్​ఆర్'​ కోసం మరింత ఫిట్​గా తయారయ్యారు. దీంతో ఆయన లుక్​కు మరింత రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఆయన.. తన తదుపరి సినిమా కోసం జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది. ఇది చూసిన అభిమానులు విపరీతంగా లైక్స్​, కామెంట్స్​తో ట్రెండ్​ చేస్తున్నారు.

'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత రామ్‌చరణ్‌.. ప్రముఖ దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. పవర్‌ఫుల్‌ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ ప్రాజెక్ట్‌ 'RC 15'గా ప్రచారంలో ఉంది. దీనిపై ఫ్యాన్స్​లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈసినిమా కోసం చరణ్‌ జిమ్‌లో శ్రమిస్తున్నారు. ప్రముఖ సెలబ్రిటీ జిమ్‌ ట్రైనర్‌ రాకేశ్‌ ఉడియార్‌ నేతృత్వంలో కసరత్తులు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ స్పెషల్‌ వీడియోని చెర్రీ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ.. "సండే మార్నింగ్‌ కిల్లర్‌ వర్కౌట్‌" అని పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు "వామ్మో.. చరణ్‌ అన్న సినిమా కోసం ఇంతలా కష్టపడుతున్నారా?", "సూపర్‌ అన్నా" అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక, 'RC 15' విషయానికి వస్తే.. పొలిటికల్‌, యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో చరణ్‌ ఐఏఎస్‌ అధికారిగా కనిపించనున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీకాంత్‌, అంజలి కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇదీ చూడండి: చిరంజీవి వల్లే నేను ప్రాణాలతో ఉన్నా!: కృష్ణవంశీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.