తెలంగాణ

telangana

old woman and granddaughter murder Case : షాద్​నగర్​ జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు..

By

Published : Jun 17, 2023, 5:22 PM IST

old woman and granddaughter murder Case at Shadnagar : హైదరాబాద్​లోని షాద్​నగర్​లో సంచలనం సృష్టించిన వృద్ధురాలు, మనుమరాలి జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. హత్య జరిగిన 24గంటల్లోనే నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసును విచారించిన పోలీసులు విస్తుపోయే వాస్తవాలను రాబట్టారు. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న బీహార్ దంపతులను వృద్ధురాలు ఖాళీ చేయించడంతో పగ పెంచుకొని మరీ అత్యంత దారుణంగా హతమార్చారు. మరి ఏ పాపం తెలియని ఆ పసిపాపను ఎందుకు హత్య చేశారంటే..!

Nandigama murders Case
Nandigama murders Case

old woman and granddaughter murder Case at Nandigama : పాపం ఆ వృద్ధురాలికి ఏం తెలుసు తన ఇంట్లోనే ఉంటూ తన ప్రాణమే ఏదో ఒక రోజు తీస్తారని.. అమ్మమ్మ అంటూ ఒకరు, నాన్నమ్మ అంటూ మరొకరు ఆ వృద్ధురాలికి దగ్గరయ్యారు. ఇంట్లో కిరాయికి ఉంటూ తన కొంపకే ఎసరు పెట్టారు. ఇల్లు అద్దెకు ఇచ్చిన పాపానికి తన మనుమరాలతో పాటు వృద్ధురాలిని కూడా బలి తీసుకున్నారు. హైదరాబాద్​లో నగరంలో సంచలనం సృష్టించిన వృద్ధురాలు, బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు ఇద్దరు బిహార్​కు చెందిన దంపతులుగా గుర్తించి వారిని అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ షాద్‌నగర్‌ మండలం నందిగామలో పార్వతమ్మ ఆమె మనుమరాలిని హత్య చేసిన వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు బిహార్‌కు చెందిన దంపతులు దివాకర్, అంజలిగా గుర్తించారు. హత్య జరిగిన 24గంటల్లోనే నిందితులను అరెస్టు చేశామని శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి వెల్లడించారు. నిందితులు పార్వతమ్మ, ఆమె మనుమరాలు భానుప్రియను ఈనెల 16న హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Nandigama murder Case latest news : హత్య చేసిన అనంతరం నాలుగు తులాల బంగారం, వెండి గొలుసులు, నగదును దొంగతనం చేశారని డీసీపీ తెలిపారు. సమీపంలోని ఎంఎస్‌ఎన్‌ ఫార్మా కంపెనీలో పనిచేస్తూ పార్వతమ్మ ఇంట్లో దివాకర్ కుటుంబం అద్దెకు ఉంటున్నారని.. నాలుగు రోజుల క్రితం ఇల్లు ఖాళీ చేసి వెళ్లినట్లు పేర్కొన్నారు. దివాకర్, అంజలి దంపతులు తరుచూ గొడవ పడడంతో పార్వతమ్మ వారిని ఇళ్లు ఖాళీ చేయించింది.

దీంతో వారు దగ్గరలోనే మరో ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఈ క్రమంలో పార్వతమ్మపై కోపం పెంచుకొని అదే మనసులో పెట్టుకొని దివాకర్ వృద్ధురాలిని హత్య చేశాడు. ఆమె పక్కనే ఉన్న చిన్నారి భానుప్రియ కేకలు వేయడంతో ఆమెను కూడా కత్తితో గొంతుకోసి హతమార్చాడు.

"జంట హత్యల కేసును 24 గంటల్లో ఛేదించాం. ఇద్దరినీ బిహార్ వాసి దివాకర్ హత్య చేశాడు. వృద్ధురాలిని హత్య చేసిన తరువాత బాలిక అరవడంతో ఆమెనూ హత్య చేశాడు. హత్య చేశాక ఇంట్లోని బంగారం, వెండి, నగదు చోరీ చేశాడు. పార్వతమ్మ ఇంట్లోనే దివాకర్‌ అద్దెకు ఉండేవాడు. నిందితుడు దివాకర్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. దివాకర్ దంపతులు తరచుగా ఘర్షణ పడటం చూసి ఇల్లు ఖాళీ చేయించారు. దివాకర్‌ 4 రోజుల క్రితం ఇల్లు ఖాళీ చేసి వెళ్లాడు. పార్వతమ్మ ఇంటికి దగ్గర్లోని మరో ఇంట్లో అద్దెకు దిగాడు. ఇల్లు ఖాళీ చేయించారని పార్వతమ్మపై పగ పెంచుకున్నాడు"-నారాయణ రెడ్డి, శంషాబాద్ డీసీపీ

షాద్​నగర్​ జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details