తెలంగాణ

telangana

తెలంగాణకు జాతీయ స్థాయిలో పేరు వచ్చింది: పంజాబ్ స్పీకర్

By

Published : Dec 27, 2022, 3:03 PM IST

Punjab Speaker Visited The State Assembly: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు జాతీయస్థాయిలో మంచి పేరు వచ్చిందని పంజాబ్ శాసనసభాపతి కుల్తార్ సింగ్ సంధ్వాన్ ప్రశంసించారు. హైదరాబాద్ వచ్చిన పంజాబ్ బృందానికి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డి స్వాగతం పలికారు.

Punjab Speaker Visited The State Assembly
Punjab Speaker Visited The State Assembly

Punjab Speaker Visited The State Assembly: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణకు జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చిందని పంజాబ్‌ శాసనసభాపతి కుల్తార్‌ సింగ్‌ సంధ్వాన్‌ ప్రశంసించారు. ఆయన నేతృత్వంలోని బృందం రాష్ట్ర అసెంబ్లీని సందర్శించింది. వారికి రాష్ట్ర స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి స్వాగతం పలికారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి పంజాబ్‌ స్పీకర్‌కు పోచారం శ్రీనివాస్​రెడ్డి వివరించారు.

"కొత్త రాష్ట్రం అయినప్పటికీ తెలంగాణ అద్భుతాలు చేస్తోంది. ఈ రాష్ట్రానికి జాతీయస్థాయిలో పేరు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బాగున్నాయి. ఇవి దేశానికి స్ఫూర్తి దాయకం." -కుల్తార్ సింగ్ సంధ్వాన్, పంజాబ్ శాసనసభాపతి

తెలంగాణకు జాతీయ స్థాయిలో పేరు వచ్చింది: కుల్తార్‌ సింగ్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details