తెలంగాణ

telangana

కేసీఆర్ హనీ ట్రాప్‌లో ఉండవల్లి పడ్డారు: రేవంత్‌రెడ్డి

By

Published : Jun 14, 2022, 7:40 PM IST

Updated : Jun 14, 2022, 7:53 PM IST

revanth on undavalli: కేసీఆర్ హనీ ట్రాప్‌లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ పడ్డారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెరాస, భాజపా ఒకటేనన్న రేవంత్.. ఈ లాజిక్ ఉండవల్లికి అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్‌తో భేటీ తర్వాత ఉండవల్లి ఆయన భజన చేస్తున్నారని.. ఆయన పట్ల గతంలో గౌరవం ఉండేదని.. కానీ ఇప్పుడు అది లేదని అన్నారు.

PCC CHIEF REVANTH REDDY ON EX MP UNDAVALLI
ఉండవల్లి... కేసీఆర్ హనీ ట్రాప్‌లో పడ్డారు: రేవంత్‌రెడ్డి

కేసీఆర్ హనీ ట్రాప్‌లో ఉండవల్లి పడ్డారు: రేవంత్‌రెడ్డి

revanth on undavalli: ముఖ్యమంత్రి కేసీఆర్‌ భాజపాపై పోరాడితే.. కేసీఆర్ చేసిన అవినీతిపై భాజపా ఎందుకు విచారణ జరిపించడం లేదన్న చిన్న లాజిక్‌ను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఎలా మరిచిపోయారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ను కలిసిన తరువాత మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పందించారు. కేసీఆర్ పంచన చేరి.. ఉండవల్లి భజన చేయడంతో తెలంగాణ ప్రజల్లో ఉండవల్లిపై ఉన్న గౌరవం పోయిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ హనీ ట్రాప్‌లో ఉండవల్లి పడ్డారని ఆరోపించారు.

సమైక్యాంధ్ర సిద్ధాంతం కోసం పోరాడారనే గౌరవం ఉండవల్లిపై ఉండేదని... ఇప్పుడు ఆయన కేసీఆర్‌కు భజన చేయడంతో ఆ గౌరవం కాస్త పోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇంటికి పిలిచి ఉండవల్లికి ఏం చెప్పారో.. తనకు తెలియదని.. కేసీఆర్‌కు భజన చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజనపై ఉండవల్లి రెండు పుస్తకాలు రాశారని... ఆ పుస్తకాల్లో తెలంగాణ ఏర్పాటునే తప్పు బట్టారని విమర్శించారు. తాను న్యాయస్థానానికి వెళ్లానని... తిరిగి రెండు రాష్ట్రాలు కలవడం ఖాయమని కూడా పుస్తకంలో ముందు మాటలో రాశారని ఆరోపించారు.

కేసీఆర్ హనీ ట్రాప్‌లో ఉండవల్లి పడ్డారు. సమైక్యాంధ్ర సిద్ధాంతం కోసం పోరాడారనే గౌరవం ఉండేది. కేసీఆర్ ఇంట్లోకి పిలిచి ఉండవల్లికి ఏం చెప్పారో... కేసీఆర్ పంచన చేరి.. ఉండవల్లి భజన చేయడంతో తెలంగాణ ప్రజల్లో ఉండవల్లికి గౌరవం పోయింది. కేసీఆర్ భాజపాపై పోరాడితే.. కేసీఆర్ చేసిన అవినీతిపై భాజపా ఎందుకు విచారణ జరిపించడం లేదు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు ఉండవల్లి.. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్లంతా.. బిహార్ వాళ్లే... బీఆర్ఎస్ అంటే.. బిహార్ రాష్ట్ర సమితి. - పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

తెలంగాణ కోసం పోరాడిన మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లను విమర్శించారంటూ ఆ పుస్తకాలను కూడా మీడియా ముందు చూపెట్టారు. అలాంటి వ్యక్తిని కేసీఆర్ ఇంటికి పిలిచి కలసి పనిచేయమంటరా.. అని ప్రశ్నించారు. ''సార పాతదే అయినా.. సీసా కొత్తది అన్నట్లు....'' తెరాసను కాస్త భరాసగా మారుస్తారట అని ఎద్దేవా చేశారు. ఉండవల్లి అడ్డామీద కూలీగా మారి కేసీఆర్‌తో కలవొద్దని... తెలంగాణను వ్యతిరేకించిన ఉండవల్లిని కేసీఆర్ దగ్గరకు తీస్తే.. తెలంగాణ సమాజం ఊరుకోదని రేవంత్ హెచ్చరించారు.

ఇదీ చూడండి: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందనే భయంతోనే మోదీ కుట్ర: రేవంత్‌రెడ్డి

Last Updated :Jun 14, 2022, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details