తెలంగాణ

telangana

Pattana pragathi : సఫాయి అన్నా సలాం నీకు.. ఘనంగా పట్టణప్రగతి దినోత్సవ వేడుకలు

By

Published : Jun 16, 2023, 7:55 PM IST

Pattana pragathi day : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా.. పట్టణ ప్రగతి ఉత్సవాలు ఉత్సాహంగా సాగాయి. పారిశుద్ధ్య కార్మికులను.. సఫాయి అమ్మ, సఫాయి అన్న సలాం అంటూ.. ప్రజాప్రతినిధులు, అధికారులు సన్మానం చేశారు. పట్టణాల్లో పారిశుద్ధ్య వాహనాల భారీ ర్యాలీలతో సందడి వాతావరణం నెలకొంది.

పట్టణప్రగతి
పట్టణప్రగతి

సఫాయి అన్నా సలాం నీకు.. ఘనంగా పట్టణప్రగతి దినోత్సవ వేడుకలు

telangana decade celebrations : రాష్ట్రవ్యాప్తంగా ఊరూవాడ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు అంబరన్నంటుతున్నాయి. వేడుకల్లో భాగంగా.. పట్టణ ప్రగతి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం.. పట్టణ ప్రగతిని సాధిస్తోందని, స్వచ్ఛ​సర్వేక్షణ్​లో మన పురపాలక సంఘాలు అవార్డులు సైతం పొందాయని మంత్రి మల్లారెడ్డి హర్షం వ్యక్తంచేశారు.

మేడ్చల్ మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో పట్టణప్రగతి దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలో.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో పట్టణప్రగతి ఉత్సవాలు జోరుగా సాగాయి. నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఫంక్షన్​హాల్‌లో అర్బన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా, రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్​రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో.. నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవంలో ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ పాల్గొని పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. వరంగల్​లో పట్టణ ప్రగతి ర్యాలీని పెద్దఎత్తున నిర్వహించారు. కేఎమ్​సీ నుంచి ఎంజీఎం కూడలి వరకూ నిర్వహించిన ప్రదర్శనలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, సీపీ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి రోడ్లను ఊడ్చారు. సఫాయి అన్నా సలాం నీకు అంటూ నినదించారు. ఎంజీఎం​ కూడలిలో సఫాయి కార్మికుల విగ్రహావిష్కరణ చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో నిర్వహించిన పట్టణప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే అరూరి రమేష్ బతుకమ్మ ఎత్తుకుని ర్యాలీలో పాల్గొన్నారు. అదిలాబాద్‌లో పట్టణప్రగతి దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, ఎమ్మెల్యే జోగురామన్న, పుర అధ్యక్షుడు జోగు ప్రేమేందర్‌, కమిషనర్​ శైలజ తదితరులు ఉద్యోగులతో కలసి ర్యాలీలో పాల్గొన్నారు. పారిశుద్ధ కార్మికులను సన్మానించారు. పట్టణ పరిధిలో జరిగిన అభివృద్దిని వివరించారు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో నిర్వహించిన పట్టణప్రగతి వేడుకల్లో మంత్రి గండ్ర వెంకటరమణారెడ్డి.. మహిళలతో కలిసి నృత్యం చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో పట్టణ ప్రగతి వేడుకల్లో భాగంగా.. అంగన్​వాడి ఐకేపీ మహిళ ఉద్యోగులకు పురపాలక కార్యాలయం వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఖమ్మంలో పట్టణప్రగతి దినోత్సవంలో భాగంగా చేపట్టిన ర్యాలీలో మంత్రి అజయ్ పాల్గొన్నారు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో నిర్వహించిన వేడుకల్లో.. పారిశుద్ధ్య కార్మికుల కాళ్లను ఎమ్మెల్సీ తాతా మధు కడగగా.. కార్మికుల పాదాలపై ఎమ్మెల్యే హరిప్రియ.. పూలు చల్లి సత్కరించారు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details