తెలంగాణ

telangana

మాదాపూర్‌లో కారు బీభత్సం.. ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

By

Published : Oct 9, 2021, 7:34 PM IST

Updated : Oct 9, 2021, 10:24 PM IST

మాదాపూర్‌లో కారు బీభత్సం.. ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు
మాదాపూర్‌లో కారు బీభత్సం.. ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

19:31 October 09

మాదాపూర్‌లో కారు బీభత్సం.. ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

హైదరాబాద్​లోని మాదాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మాదాపూర్ పర్వత్ నగర్ సమీపంలోని ఆటో స్టాండ్ నుంచి పర్వత్ నగర్ సిగ్నల్ వైపు అతివేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డు దాటుతున్న ఇద్దరిని ఢీకొంది.

 వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మాదాపుర్ కావూరి హిల్స్ వాచ్​మెన్​గా పని చేస్తున్న డానియల్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. అతి వేగంగా, అజాగ్రత్తగా కారు నడిపిన వ్యక్తి బంజారాహిల్స్​లో విద్యుత్ శాఖలో డీఈగా పనిచేస్తున్న నరేందర్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి మాదాపుర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదీ చదవండి: RAINS: మన్యంలో జోరు వాన.. పిడుగుపాటుకు ముగ్గురు మృతి

Last Updated : Oct 9, 2021, 10:24 PM IST

ABOUT THE AUTHOR

...view details