తెలంగాణ

telangana

నిజాం న్యాయ కళాశాలలో విద్యార్థుల ఆందోళన...

By

Published : Nov 7, 2019, 8:50 PM IST

హైదరాబాద్​ బషీర్​బాగ్​లోని నిజాం న్యాయ కళాశాల విద్యార్థులు ధర్నాకు దిగారు. ఇష్టారీతిన ఫీజులు పెంచి... నోటీసులు లేకుండానే పరీక్షకు అనుమంతించట్లేదని విద్యార్థులు ఆరోపించారు. మిగితా విద్యార్థులను బయటకు పంపించి పరీక్షలను బైకాట్​ చేశారు.

NIZAM LAW COLLEGE STUDENTS PROTEST FOR DON'T GIVEN PERMISSION FOR EXAMS

నిజాం న్యాయ కళాశాలలో విద్యార్థుల ఆందోళన...

హైదరాబాద్ బషీర్​బాగ్​లోని నిజాం న్యాయకళాశాల విద్యార్థులు ఆందోళన చేశారు. ఫీజు చెల్లించలేదన్న కారణంతో పరీక్షకు అనుమతించలేదంటూ... గేటు ముందు బైఠాయించారు. కళాశాల నిధులను ప్రిన్సిపల్​ అరుణ దుర్వినియోగం చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఈ విషయంపై ప్రిన్సిపల్​ను ప్రశ్నించినందుకే పరీక్షకు అనుమతించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షలు రాస్తున్న మిగితా విద్యార్థులను కూడా బయటకు పంపించి విద్యార్థులు పరీక్షను బైకాట్ చేశారు. ఈ ఘటనతో కొద్దిసేపు కళాశాలలో గందరగోళం నెలకొంది.

కళాశాలకు రాకుండా, ఫీజు చెల్లించకుండా పరీక్షకు ఎలా అనుమతిస్తారు?

విద్యార్థులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని న్యాయకళాశాల ప్రిన్సిపాల్ అపర్ణ తెలిపారు. గడువు దాటినా... ఫీజు చెల్లించకపోవడం వల్లే పరీక్షకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. కళాశాలకు రాకుండా, ఫీజు చెల్లించకుండా పరీక్షకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. కావాలనే కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారని... ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యూలైజేషన్ ద్వారానే పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్​ వెల్లడించారు.

ఇదీ చూడండి: వాయుకాలుష్యం ధాటికి మాస్కులు ధరిస్తున్న దేవుళ్లు

ABOUT THE AUTHOR

...view details