తెలంగాణ

telangana

'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. రెండోరోజు సిట్‌ విచారణకు చిత్రలేఖ

By

Published : Nov 28, 2022, 7:56 AM IST

Updated : Nov 28, 2022, 11:22 AM IST

MLAs Poaching Case Update : 'ఎమ్మెల్యేలకు ఎర' కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన నందకుమార్​ భార్య చిత్రలేఖ నేడు మరోసారి సిట్​ విచారణకు హాజరయ్యారు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఆమెను సుదీర్ఘంగా విచారించిన సిట్‌ బృందం.. అనుమానాలు నివృత్తి కాకపోవడంతో ఈరోజు మళ్లీ రావాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే చిత్రలేఖ మరోసారి సిట్​ ముందు హాజరయ్యారు.

'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. నేడు మరోసారి సిట్‌ ముందుకు చిత్రలేఖ
'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. నేడు మరోసారి సిట్‌ ముందుకు చిత్రలేఖ

MLAs Poaching Case Update : 'ఎమ్మెల్యేలకు ఎర' కేసులో నిందితుడు కోరె నందకుమార్‌ అలియాస్‌ నందు భార్య చిత్రలేఖ నేడు మరోసారి విచారణకు హాజరయ్యారు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఆమెను సిట్‌ బృందం సుధీర్ఘంగా విచారించింది. అనుమానాలు నివృత్తి కాక నేడు మరోసారి విచారణకు రావాలని సూచించింది. ఎమ్మెల్యేలకు, ప్రధాన నిందితుడు రామచంద్రభారతికి మధ్య అనుసంధానకర్తగా నందకుమార్‌ ఉండటంతో అతడి పాత్రకు సంబంధించి పూర్తిగా కూపీ లాగడంపై సిట్‌ దృష్టి సారించింది.

MLAs Baiting Case Update: నందకుమార్‌కు రాష్ట్రంలోని పలువురు ప్రముఖులతో వ్యాపార లావాదేవీలు ఉండటంతో ఆ వివరాలను రాబట్టే పనిలో నిమగ్నమైంది. సదరు లావాదేవీలకు కేసుతో ఏమైనా సంబంధముందా..? అనేది నివృత్తి చేసుకోవడం కీలకంగా భావిస్తోంది. ఇప్పటికే కరీంనగర్‌ న్యాయవాది బూసారపు శ్రీనివాస్‌తో పాటు అంబర్‌పేట న్యాయవాది పోగులకొండ ప్రతాప్‌గౌడ్‌తో నందుకున్న ఆర్థిక లావాదేవీలను సిట్‌ గుర్తించింది. వీటికి ఎమ్మెల్యేలకు ఎర కేసుతో సంబంధముందా అనే విషయాన్ని కూపీ లాగుతోంది. ఈ క్రమంలోనే చిత్రలేఖను విచారించడం ద్వారా కీలక ఆధారాలేమైనా లభిస్తాయనే అంచనాతో ఉన్నారు.

నందు ఆర్థిక లావాదేవీల గుట్టుపైనే గురి..: తన ఆర్థిక లావాదేవీల గురించి భార్యతో నందకుమార్‌ విస్తృతంగా చర్చిస్తాడనేది సిట్‌ అనుమానం. అందుకు సంబంధించి దంపతులిద్దరి మధ్య వాట్సప్‌ చాటింగ్‌లనూ గుర్తించినట్లు సమాచారం. తొలిరోజు విచారణలో వాటి గురించి చిత్రలేఖ పెద్దగా స్పందించనందునే నేడు మళ్లీ విచారణకు రావాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చిత్రలేఖ నేడు మరోసారి సిట్​ ముందు హాజరయ్యారు. మరోవైపు ఓ ఎన్జీవో ప్రతినిధి విజయ్‌నూ సోమవారం సిట్‌ విచారించనుంది. తొలుత శనివారం ఆయనను విచారించిన పోలీసులు మళ్లీ రావాలని సూచించారు.

Last Updated :Nov 28, 2022, 11:22 AM IST

ABOUT THE AUTHOR

...view details