తెలంగాణ

telangana

ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలి: ఉత్తమ్​

By

Published : Mar 13, 2021, 4:05 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ.. ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్‌కు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం ఫిర్యాదు చేసింది.

ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలి: ఉత్తమ్​
ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలి: ఉత్తమ్​

ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలి: ఉత్తమ్​

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్​ బుద్ద భవన్‌లోని కమిషన్ కార్యాలయంలో ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్‌ను ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం ఫిర్యాదు చేసింది.

నకిలీ ఓటర్లు, డిగ్రీ లేని వారిని ఓటింగ్‌కు అనుమతించవద్దని.. తెరాస ప్రకటనలపై ఐటీశాఖతో విచారణ జరిపించాలని ఈసీని కోరారు. పీవీ నరసింహారావు ఫొటో వాడుకోవటంపైనా సీఈఓకు అభ్యంతరం తెలిపామని వెల్లడించారు. తమ ఫిర్యాదులపై సీఈవో సానుకూలంగా స్పందించారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి:ఎన్నికల నియమావళిని తెరాస ఉల్లంఘించింది: కొల్లు వెంకటేశ్వర్లు

ABOUT THE AUTHOR

...view details