తెలంగాణ

telangana

'పది' పేపర్ లీకేజీ.. ప్రభుత్వం రాసిన స్క్రిప్టే: MLA రఘునందన్​రావు

By

Published : Apr 6, 2023, 1:55 PM IST

MLA Raghunandan on Bandi Sanjay Arrest : 'పది' పేపర్​ లీకేజీలో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులకు భరోసా కల్పించకుండా రాజకీయం తగదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు హితవు పలికారు. సీపీ రంగనాథ్ ప్రస్తావించిన అంశాలన్నీ ప్రభుత్వం చెప్పించినవేనన్న ఆయన.. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపకుండా అధికార పార్టీకి పావులుగా మారుతున్నారని ఆరోపించారు.

MLA Raghunandan on Bandi Sanjay Arrest
MLA Raghunandan on Bandi Sanjay Arrest

'పది' పరీక్ష లీకేజీ ప్రభుత్వం రాసిన స్క్రిప్టే: రఘునందన్​రావు

MLA Raghunandan on Bandi Sanjay Arrest : రాష్ట్రంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం వ్యక్తిగత రాజకీయాలు నడుపుతోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు ఆక్షేపించారు. లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులకు భరోసా కల్పించకుండా రాజకీయం తగదని హితవు పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్​ను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.

Bandi Sanjay Arrest latest update : తొలుత కరీంనగర్​లో ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పి.. అరెస్టు చేశారని రఘునందన్​రావు ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.. బీజేపీని అప్రతిష్ట పాలు చేసేందుకు వరంగల్ సీపీ రంగనాథ్ ప్రస్తావించిన అంశాలన్నీ ప్రభుత్వం చెప్పించినవేనని తప్పుబట్టారు. రాజద్రోహం, దేశద్రోహం అంటూ సీపీ మాట్లాడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వమే కథ అల్లి పోలీసులతో చెప్పించినట్లు భావిస్తున్నామని అన్నారు.

శివ గణేశ్ తీసిన ఫొటో మొదట ఎవరికి వెళ్లిందని ప్రశ్నించిన రఘునందన్​రావు.. ఆ పేపర్ ఎంత మందికి వెళ్లిందో ఆ అందరినీ విచారించారా అని పోలీసులను నిలదీశారు. సాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వడం రివాజు అన్న ఆయన.. కేటీఆర్, హరీశ్ రావు, రేవంత్ రెడ్డి.. ఇలా అందరికీ మీడియా ప్రతినిధులు సమాచారం ఇస్తూ ఉంటారని చెప్పారు. సమాచారం పంపడమే నేరమా‌ అంటూ మండిపడ్డారు. అధికార పార్టీని సంతృప్తి పరిచేందుకు సీపీ వ్యవరిస్తున్న తీరు సరికాదని పేర్కొన్నారు.

''బండి సంజయ్ కుమార్​ను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గం. లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులకు భరోసా కల్పించకుండా రాజకీయం తగదు. వరంగల్ సీపీ రంగనాథ్ మీడియాకు చెప్పిన అంశాలన్నీ ప్రభుత్వం చెప్పినవే. శివ గణేశ్ తీసిన ఫొటో మొదట ఎవరికి వెళ్లింది. ఆ పేపరు ఎంత మందికి వెళ్లిందో.. ఆ అందరినీ విచారించారా..? అధికార పార్టీని సంతృప్తి పరిచేందుకు సీపీ వ్యవరిస్తున్న తీరు సరికాదు. ఘటనలో పోలీసులను పావులుగా వాడుకుంటున్నారు. జరిగిన అన్యాయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తాం. గోడ దూకి వెళ్లి హిందీ పేపర్‌ ఫొటో తీసినట్లు చెబుతున్నారు. ఫొటో తీస్తుంటే పోలీసుల నిఘా ఎక్కడ ఉంది. బండి సంజయ్‌కు ఉదయం 11.20 తర్వాత పేపర్‌ వచ్చిందని చెబుతున్నారు. ఫొటో తీసిన వ్యక్తికి బీజేపీతో ఏమైనా సంబంధం ఉందా..? శివ గణేశ్ ఫోన్‌ వాట్సప్‌ వివరాలు బయటపెట్టాలి. ప్రభుత్వమే కథ అల్లి పోలీసులతో చెప్పించినట్లు భావిస్తున్నాం.''- రఘునందన్ రావు, బీజేపీ ఎమ్మెల్యే

ఇవీ చూడండి..

'పది' పరీక్ష లీకేజీ కేసు.. బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

సోషల్ ​మీడియాలో రాజకీయ విమర్శలూ నేరమేనా?.. వైసీపీ కోసం పోలీసుల ప్రత్యేక చట్టం..!

ABOUT THE AUTHOR

...view details