తెలంగాణ

telangana

SRINIVAS GOUD: నేటినుంచి సాంస్కృతిక శాఖ బతుకమ్మ సంబురాలు

By

Published : Oct 6, 2021, 5:27 PM IST

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి తెలిపే విధంగా బతుకమ్మ సంబురాల(bathukamma celebrations)ను నిర్వహించనున్నామని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​(minister srinivas goud) తెలిపారు. ఇవాళ్టి నుంచి 13వ తేదీ వరకు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్... ఈ బతుకమ్మ పండుగకు ఎనలేని వైభవం, ఖ్యాతి తీసుకొచ్చారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

SRINIVAS GOUD: 'నేటి నుంచి 13 వరకు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు'
SRINIVAS GOUD: 'నేటి నుంచి 13 వరకు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు'

నేటి నుంచి 13వ తేదీ వరకు బతుకమ్మ సంబురాల(bathukamma celebrations)ను సాంస్కృతిక శాఖ ఆధ్యర్యంలో నిర్వహిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి తెలిపే విధంగా వీటి నిర్వహణ చేస్తున్నామన్నారు. రవీంధ్రభారతిలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్​(minister srinivas goud) పాల్గొన్నారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా వల్ల బతుకమ్మ సంబురాలు నిర్వహించలేకపోయామని.. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరిగి నిర్వహిస్తున్నామన్నారు.

ఒక్కోరోజు ఒక్కో మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు(bathukamma celebrations) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మహిళా ఉద్యోగులు, ప్రజా సంఘాలు, గెజిటెడ్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, చివరిరోజు ఎమ్మెల్సీ కవిత, పద్మాదేవేందర్ గౌడ్​లు పాల్గొంటారన్నారు. మహిళలు ఎక్కడ గౌరవించబడుతారో.. ఆ ప్రాంతం అన్ని విధాలుగా బాగుంటుందన్నారు.

ఈ రోజు నుంచి 13వ తారీఖు వరకు రవీంద్రభారతి వేదికగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహిస్తాం. ప్రతి జిల్లాలో కూడా సంబురాలు నిర్వహించనున్నాం. ప్రతి జిల్లాలో మహిళా ఉద్యోగులకు వెసులుబాటు కల్పించినం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి తెలియజేసే విధంగా ఘనంగా నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేశాం. ఒకప్పుడు బతుకమ్మ పండుగ ఆఫీసుల్లో కాదు కదా.. మాట్లాడలేని పరిస్థితి. బతుకమ్మ పండుగ అంటేనే పండుగేనా అనేలా ఆనాడు అవమానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కవిత జాగృతి అనే సంస్థను స్థాపించి దేశ విదేశాల్లో బతుకమ్మ పండుగను నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నాం.

-శ్రీనివాస్​ గౌడ్​, రాష్ట్ర మంత్రి

'నేటి నుంచి 13 వరకు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు'

ఎంగిలపూల బతుకమ్మ శుభాకాంక్షలు: మంత్రి సత్యవతి రాఠోడ్​

'బతుకమ్మ' అంటేనే బతుకు చెప్పే అర్థం ఉన్న పండగ అని... అందుకే తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్... ఈ బతుకమ్మ పండుగకు ఎనలేని వైభవం, ఖ్యాతి తీసుకొచ్చారన్నారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించమే కాకుండా సెలవులు ఇచ్చి మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేసి అత్యంత గొప్పగా జరుపుకునే అవకాశం కల్పించారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో మహిళలు పుట్టింటికి వెళ్లి గొప్పగా నిర్వహించుకుంటారని అన్నారు.

గత నాలుగేళ్లుగా ఈ పండగ సందర్భంగా ముఖ్యమంత్రి ఏటా కోటి మందికి పైగా మహిళలకు తండ్రిగా, సోదరుడిగా చీరలు ఇస్తూ సంతోషంతో పాటు చేనేత కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. ఆడపడుచులు బతుకమ్మ సంబురాల కోసం ప్రతి చోట 'మినీ ట్యాంక్ బండ్‌లు' ఏర్పాటు చేసి పండుగను ఘనంగా జరుపుకునేందుకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారని తెలిపారు. బతుకమ్మను నిమజ్జనం చేసేందుకు గతంలో చెరువుల్లో నీళ్లు లేని పరిస్థితిని మిషన్ కాకతీయ ద్వారా మార్చేసి నీటి వనరులను నిండుకుండల్లా తయారు చేశారని హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: Jogulamba temple: జోగులాంబలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడైనా చూశారా?

ABOUT THE AUTHOR

...view details