తెలంగాణ

telangana

సినిమాను విడుదల చేసిన మంత్రి సబితా

By

Published : Dec 26, 2020, 7:54 PM IST

Minister Sabitha released the jyotirgamaya film at hyderabad
సినిమాను విడుదల చేసిన మంత్రి సబితా

చేనేత కళాకారుల జీవితాల నేపథ్యంగా తమసోమా జ్యోతిర్గమ సినిమాను యువ దర్శకుడు విజయ్ కుమార్ తెరకెక్కించారు. ఆ ప్రచార చిత్రాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.

చేనేత కుటుంబాల ఆర్థిక పురోగతికి తన వంతు సహకారాన్ని అందించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. చేనేత కళాకారుల జీవితాల నేపథ్యంలో తమసోమా జ్యోతిర్గమ సినిమాను యువ దర్శకుడు విజయ్ కుమార్ తెరకెక్కించారు.

ఆ ప్రచార చిత్రాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్​లోని తన నివాసంలో లాంఛనంగా విడుదల చేశారు. ప్రచార చిత్రాన్ని వీక్షించిన మంత్రి చిత్ర దర్శక నిర్మాతలను ప్రత్యేకంగా అభినందించారు. తమసోమా జ్యోతిర్గమ చిత్రాన్ని తప్పకుండా ముందస్తుగానే వీక్షిస్తానని తెలిపిన మంత్రి.. ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహకారాన్ని అందించనున్నట్లు హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి :'మా భూమి' సినిమా 80 శాతం షూటింగ్​ అక్కడే!

ABOUT THE AUTHOR

...view details