తెలంగాణ

telangana

Minister Niranjan Reddy Participated in Swaminathan Funeral : 'యుగానికి ఒక్కరు ఎం.ఎస్.​ స్వామినాథన్.. భారతరత్న పురస్కారం ఇవ్వాలి'

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2023, 6:23 PM IST

Minister Niranjan Reddy Participated in Swaminathan Funeral : డాక్టర్ స్వామినాథన్ లాంటి మహనీయులు యుగానికి ఒక్కరు పుడతారని మంత్రి నిరంజన్​రెడ్డి అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త మరణం బాధాకరమన్నారు. చెన్నైలోని తారామణిలో స్వామినాథన్ భౌతికకాయానికి ఆయన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Scientist Swaminathan Death
Minister Niranjan Reddy

Minister Niranjan Reddy Participated in Swaminathan Funeral యుగానికి ఒక్కరు ఎంఎస్ స్వామినాథన్ భారతరత్న పురస్కారం ఇవ్వాలి

Minister Niranjan Reddy Participated in Swaminathan Funeral : భారత హరిత విప్లవం పితామహుడు, దివంగత ప్రొఫెసర్ స్వామినాథన్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(Singireddy Niranjan Reddy) అన్నారు. ఇప్పటికే అవార్డు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందని.. భారతరత్న ఇవ్వడం ద్వారా శాస్త్రవేత్తలు, ఈ దేశ రైతాంగం, వ్యవసాయ రంగాన్ని గౌరవించినట్లవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. డాక్టర్ స్వామినాథన్(Swaminathan) లాంటి మహనీయులు యుగానికి ఒక్కరు పుడతారని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త మరణం బాధాకరమన్నారు.

Niranjan Reddy on Scientist Swaminathan Death :చెన్నైలోని తారామణిలో సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ భౌతికఖాయానికి మంత్రి నిరంజన్​రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి అంత్యక్రియల్లో హాజరయ్యారు. మంత్రి వెంట వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం రఘునందన్‌రావు, తెలంగాణ సీడ్స్ సంస్థ ఎండీ డాక్టర్ కున్‌సోత్ కేశవులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ఆకలితో అలమటించి.. లక్షలాది మంది చనిపోయిన పరిస్థితి చూసి చలించి వైద్య విద్య వదిలేసి వ్యవసాయ విద్య ఎంచుకుని, పరిశోధకుడిగా మారి ప్రపంచ ప్రఖ్యాతిగాంచారని మంత్రి కొనియాడారు.

Rythu Badi Youtube Channel 1 Million Mega Event : 'భావి ప్రపంచాన్ని శాసించేది ఆహార రంగమే.. ఆ అవసరాలు తీర్చే శక్తి ఒక్క భారత్​కే సొంతం'

పరిశోధకుడిగా తిండిగింజలను అందించి ఆకలిని రూపుమాపేందుకు కంకణం కట్టుకున్న శాస్త్రీయ యోధుడు.. మానవాళి జీవిస్తున్న ఈ వందేళ్లకాలంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అతి కొద్దిమందిలోని అద్భుతమైన శాస్త్రవేత్త స్వామినాథన్(Scientist Swaminathan) అని మంత్రి అన్నారు. ఆయన సారధ్యంలో ఏర్పడిన కమీషన్.. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని సూచించింది. జాతీయ స్థాయి కమీషన్ వేసిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ(UPA) సర్కారు, స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తానన్న బీజేపీ ప్రభుత్వం(BJP Government) అమలు చేయకుండా రైతాంగానికి తీవ్ర అన్యాయం చేశాయని మంత్రి నిరంజన్​రెడ్డి ఆరోపించారు.

రెండు నెలల క్రితమే స్వామినాథన్​ని కలిసాం : స్వామినాథన్ మొదటి ఆహార పురస్కార విజేతగా భారతదేశం ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచారని మంత్రి పేర్కొన్నారు. రెండు నెలల క్రితమే వారిని వ్యక్తిగతంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నానని చెప్పారు. 'తెలంగాణ రాష్ట్రానికి వస్తాను.. వార్తలు చూస్తున్నాను.. ఆరోగ్యం కుదుటపడితే వస్తాను' అని చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు స్వామినాథన్‌ తెలంగాణకు వస్తానన్న ఆసక్తి తమలో స్ఫూర్థి నింపిందని అన్నారు. వారి దార్శనికత ఎంతో గొప్పదని, కేవలం పరిశోధకుడే కాదు ఆయన.. భావితరాల అవసరాలు గుర్తెరిగి చిత్తశుద్ధితో ప్రజలే కేంద్రబిందువుగా పనిచేశారని తెలిపారు. తెలంగాణ రైతాంగం పక్షాన, ప్రజల పక్షాన, ప్రభుత్వం పక్షాన వారికి శిరస్సు వచ్చి శ్రద్దాంజలి ఘటించామని మంత్రి చెప్పారు. స్వామినాథన్ సిఫార్సులు మోదీ సర్కారు అమలు చేయకపోవడం దురదృష్టకరమని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

MS Swaminathan Passes Away : స్వామినాథన్‌​ మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి​ .. వ్యవసాయరంగ పెద్ద దిక్కును కోల్పోయిందంటూ నివాళి

Niranjan Reddy on Telangana Crop Loss : 'త్వరలోనే రాష్ట్రంలో.. ప్రత్యేక పంట బీమా పథకం'

ABOUT THE AUTHOR

...view details