ETV Bharat / state

MS Swaminathan Passes Away : స్వామినాథన్‌​ మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి​ .. వ్యవసాయరంగ పెద్ద దిక్కును కోల్పోయిందంటూ నివాళి

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2023, 8:26 PM IST

MS Swaminathan Dead in Chennai : భారత హరితపితామహుడు స్వామినాథన్‌ మృతిపట్ల.. ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణను.. స్వామినాథన్‌ పలుమార్లు కొనియాడారని.. గుర్తు చేసుకున్నారు. తెలంగాణ దేశానికే విత్తన భాండాగారంగా విలసిల్లుతోందని చెప్పిన స్వామినాథన్ ఆకాంక్షలను ప్రభుత్వం నిజం చేసి చూపించిందని కేసీఆర్ తెలిపారు.

CM KCR Condoles Death of Swaminathan
MS Swaminathan Dead in Chennai

MS Swaminathan Passes Away స్మామినాథన్​ మృతి పట్ల కేసీఆర్​ నివాళి.. వ్యవసాయరంగ పెద్ద దిక్కును కోల్పోయిందంటూ

MS Swaminathan Passes Away in Chennai : స్వామినాథన్(MS Swaminathan) మరణంతో.. దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కు కోల్పోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆవేదన వ్యక్తం చేశారు. సాంప్రదాయ పద్దతిలో సాగుతున్న దేశీయ వ్యవసాయాన్ని స్వామినాథన్.. వినూత్న పద్ధతుల్లో గుణాత్మక దశకు చేర్చారన్నారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందంటే.. అది స్వామినాథన్​ కృషితోనే సాధ్యమైందని ముఖ్యమంత్రి కొనియాడారు.

MS Swaminathan Biography : 'దేశం ఓ కుమారుణ్ని కోల్పోయింది'.. ఎంఎస్ స్వామినాథన్​కు ప్రముఖుల నివాళి

CM KCR Condoles Death of Swaminathan : దేశ ప్రజలకు ప్రధాన ఆహార వనరులైన వరి, గోధుమ తదితర పంటలపై స్వామినాథన్ చేసిన అద్భుతమైన ప్రయోగాలతో.. ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించిందని కేసీఆర్(CM KCR) పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఎంఎస్ స్వామినాథన్‌తో సమావేశం.. వారు చేసిన సూచనలు అమూల్యమైనవన్న సీఎం.. ఉచిత విద్యుత్, ఎత్తిపోతలతో సాగునీటి రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వ కార్యాచరణను ఎంతగానో ప్రశంసించారని గుర్తు చేసుకున్నారు.

Father of Indian Green Revolution : తెలంగాణ నేలలు అత్యంత సారమంతవైనవని, పాలకులు సరైన దృష్టి సారిస్తే తెలంగాణ దేశానికే విత్త భాంఢాగారంగా విలసిల్లుతుందని చెప్పిన స్వామినాథన్ ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిజం చేసి చూపించిందని కేసీఆర్ చెప్పారు. ఇటీవల వారితో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల సమావేశంలో.. తెలంగాణ వ్యవసాయాభివృద్ధి తెలుసుకుని ఎంతో ఆనందం వ్యక్తం చేశారని.. వీలు చూసుకుని తెలంగాణ పర్యటనకు వస్తానని మాట ఇచ్చారని చెప్పారు. ఆ ఆకాంక్ష తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెల్లిపోవడం బాధ కలిగిస్తోందని సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు.

స్వామినాథన్‌ మృతి పట్ల.. శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు, ప్రశాంత్​రెడ్డి, ఇంద్రకరణ్​రెడ్డి, గంగుల కమలాకర్ సహా పలువురు మంత్రులు సంతాపం ప్రకటించారు. స్వామినాథన్‌కు తెలంగాణ రాష్ట్రమంటే.. ప్రత్యేక అభిమానమని.. చెన్నైలో ఆయన నివాసంలో.. కలిసి మాట్లాడిన రోజులను మంత్రి నిరంజన్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు.

దేశంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తిని పెంచుకోవడం.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం తదితర అంశాల్లో స్వామినాథన్‌ చేసిన కృషిని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయ రంగంలో జరిగే పరిశోధనలకు వారు ఓ మార్గదర్శి.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తన పరిశోధనలతో దేశ ప్రజల ఆకలి తీర్చిన మహోన్నత వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం. స్వామినాథన్​కు తెలంగాణ రాష్ట్రమంటే ప్రత్యేక అభిమానం. చెన్నైలో ఆయన నివాసంలో కలుసుకున్నప్పుడు.. రాష్ట్ర వ్యవసాయరంగ ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. తన ఆరోగ్యం బాగుంటే తెలంగాణ పర్యటనకు వస్తానన్నారు. - నిరంజన్​రెడ్డి, మంత్రి

MS Swaminathan Passed Away : హరిత విప్లవ పితామహుడు ఎంఎస్​ స్వామినాథన్​ కన్నుమూత

త్వరలోనే విత్తన భాండాగారంగా తెలంగాణ: స్వామినాథన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.