తెలంగాణ

telangana

Niranjan reddy: 'ఉద్యోగులకు మానసిక ఉల్లాసం ఎంతో అవసరం'

By

Published : Jun 29, 2021, 12:30 PM IST

హైదరాబాద్ కోఠిలో టెస్కాబ్ ఉద్యోగుల సౌకర్యార్థం నిర్మించిన వసతి గృహాలను మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. వీటిని రూ.14 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. అనంతరం బోట్స్ క్లబ్‌ను మంత్రి ప్రారంభించారు.

Niranjan reddy, tscab
మంత్రి నిరంజన్ రెడ్డి, టెస్కాబ్

ఉద్యోగులకు మానసిక ఉల్లాసం ఎంతో అవసరమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ కోఠిలో తెలంగాణ రాష్ట్ర సహకార సంస్థ అపెక్స్ లిమిటెడ్- టెస్కాబ్‌ ఉద్యోగుల సౌకర్యార్థం నిర్మించిన వసతి గృహాలను మంత్రి ప్రారంభించారు. రూ.14 కోట్ల వ్యయంతో 25 వసతి గృహాలను నిర్మించారు. అనంతరం బోట్స్ క్లబ్‌ను మంత్రి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో టెస్కాబ్ ఛైర్మన్ కొండూరు రవీందర్‌ రావు, ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి, నాబార్డ్‌ సీజీఎం వైకే రావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:GHMC: సర్వసభ్య సమావేశం... వార్షిక పద్దుపై ఆమోదం

ABOUT THE AUTHOR

...view details