తెలంగాణ

telangana

KTR meeting with Discovery representatives : "తెలంగాణ మీడియాలోకి .. వార్నర్​ బ్రదర్స్​ డిస్కవరీ"

By

Published : May 17, 2023, 10:59 PM IST

KTR meeting with Discovery representatives in New York : న్యూయార్క్‌లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ డిస్కవరీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ వినోద రంగంలోకి వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ రంగ ప్రవేశం చేస్తుందని తెలిపారు.

KTR meeting with Discovery representatives
KTR meeting with Discovery representatives

KTR meeting with Discovery representatives in New York : తెలంగాణ వినోద రంగంలోకి వార్నర్​ బ్రదర్స్​ డిస్కవరీ రంగ ప్రవేశం చేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆయన అమెరికా పర్యటన చేస్తున్నారు. పర్యటనలో భాగంగా అమెరికాలోని ప్రముఖ నగరమైనా న్యూయార్క్‌లో డిస్కవరీ ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ వినోద రంగంలోకి వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ రంగ ప్రవేశం చేస్తుందని.. ఈ ఛానల్‌ ఈ రంగంలోకి రావడం సంతోషకరంగా ఉందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. క్రియేటివిటీ, ఇన్నోవేషన్ హబ్‌గా ఐడీసీని డిస్కవరీ ఏర్పాటు చేస్తుందని అన్నారు. తెలంగాణలోకి డిస్కవరీ వచ్చిన మొదటి సంవత్సరంలోనే 1200 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఇది తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా పేర్కొన్నారు.

డిస్కవరీ ప్రముఖ సంస్థలు : వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఒక ప్రీమియర్ గ్లోబల్ మీడియా.. దీంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ, ప్రేక్షకులకు టెలివిజన్, ఫిల్మ్, స్ట్రీమింగ్, గేమింగ్ అంతటా కంటెంట్, బ్రాండ్‌లు, ఫ్రాంచైజీలు ప్రపంచంలోని అత్యంత విభిన్నమైన పూర్తి పోర్ట్‌ఫోలియోను అందిస్తుంది. ఆ సంస్థ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రధాన పోర్ట్‌ఫోలియోలో హెచ్‌బీఓ, సీఎన్‌ఎన్‌, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, డబ్ల్యూబీ, యూరోస్పోర్ట్, యానిమల్ ప్లానెట్, కార్టూన్ నెట్‌వర్క్, సినిమాక్స్, హెచ్‌జీ టీవీ, క్వెస్ట్ ఉన్నాయని మంత్రి ట్వీటర్‌ వేదికన తెలిపారు. ఇటువంటి పరిశ్రమ దిగ్గజాలతో కలిసి పనిచేయడం.. తెలంగాణలోని మీడియా, వినోద రంగ భవిష్యత్తును రూపొందించే అద్భుతమైన అవకాశం అవుతుందని హామీ ఇచ్చారు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అపారంగా లభిస్తాయి : డిస్కవరీ ప్రతినిధుల సమావేశం అనంతరం ఒకరికి ఒకరు జ్ఞాపికలను అందజేసుకున్నారు. ఇలాంటి దిగ్గజ పరిశ్రమలు మరెన్నో రాష్ట్రంలో తీసుకురాడానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు ఫార్మా కంపెనీలు, డేటా కేంద్రాలు, ఇతర శాఖలకు చెందిన పరిశ్రమలు వస్తున్నాయని గుర్తు చేశారు. వీటి వల్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన సులభంగా లభిస్తుందని హామి ఇచ్చారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details