తెలంగాణ

telangana

అభివృద్ధి పనులకు కేటీఆర్‌ శ్రీకారం.. ప్రొటోకాల్ వివాదం

By

Published : Jan 9, 2021, 10:53 AM IST

Updated : Jan 9, 2021, 3:05 PM IST

హైదరాబాద్ దోమలగూడలో మంత్రి కేటీఆర్ కార్యక్రమంలో స్వల్ప ఉద్రికత్త చోటుచేసుకుంది. శిలాఫలకాలపై కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల పేర్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ భాజపా ఆందోళనకు దిగింది. కేటీఆర్ సమక్షంలోనే తెరాస, భాజపా శ్రేణులు పరస్పర నినాదాలు చేసుకోగా కాసేపు ఉద్రిక్తత తలెత్తింది.

అభివృద్ధి పనులకు కేటీఆర్‌ శ్రీకారం.. కార్యక్రమంలో ఉద్రిక్తత
అభివృద్ధి పనులకు కేటీఆర్‌ శ్రీకారం.. కార్యక్రమంలో ఉద్రిక్తత

అభివృద్ధి పనులకు కేటీఆర్‌ శ్రీకారం.. కార్యక్రమంలో ఉద్రిక్తత

మంత్రి కేటీఆర్ పర్యటనలో స్వల్ప ఉద్రికత్త చోటుచేసుకుంది. కొత్తగా ఎన్నికైన భాజపా కార్పొరేటర్లు నిరసన తెలిపారు. దోమలగూడ, నారాయణగూడ, బాగ్‌లింగంపల్లిలో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టగా భాజపా కార్పొరేటర్లు ఆందోళకు దిగారు. శిలాఫలకాలపై కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల పేర్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. తెరాస శ్రేణులు గట్టిగా ప్రతిఘటించాయి. కేటీఆర్ సమక్షంలోనే తెరాస, భాజపా శ్రేణులు పరస్పర నినాదాలు చేసుకోగా కాసేపు ఉద్రిక్తత తలెత్తింది.

దోమలగూడలో జోనల్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన అనంతరం కేటీఆర్ నారాయణగూడకు వెళ్లారు. దోమల్‌గూడలో రూ.9 కోట్ల90 లక్షల వ్యయంతో జోనల్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొన్నారు. అనంతరం నారాయణగూడలో మోడల్ కూరగాయల మార్కెట్‌కు కేటీఆర్ భూమిపూజ చేశారు.

రూ.4 కోట్ల వ్యయంతో 4 అంతస్తుల్లో మార్కెట్ నిర్మాణం చేపట్టనున్నారు. అక్కన్నుంచి బాగ్‌లింగంపల్లిలో లంబాడితండాలో మంత్రి కేటీఆర్ రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. 126 ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. 9 అంతస్తుల్లో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మించారు. అక్కడ కూడా భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు. కేటీఆర్ గో బ్యాక్‌ అంటూ నిరసన తెలిపారు... జీహెచ్ఎసీకి కొత్త పాలకమండలిని ఏర్పాటు చేయాలంటూ కొద్ది రోజులుగా భాజపా నేతలు, కార్పొరేటర్లు పట్టుపడుతున్నారు. తమకు ప్రొటోకాల్‌ కల్పించాలని కోరుతున్నారు. ఇటీవలే ప్రగతిభవన్‌ ముట్టడికి సైతం యత్నించారు. తాజాగా మంత్రి కేటీఆర్ పర్యటనలో నిరసన తెలపగా.. కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. తెరాస-భాజపా శ్రేణులు పోటాపోటీ నినాదాలతో పరిస్థితి గందరగోళంగా మారింది.

ఇదీ చూడండి:డ్రైరన్‌కు సాఫ్ట్‌వేర్‌ తిప్పలు... కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ఆరోగ్యశాఖ

Last Updated : Jan 9, 2021, 3:05 PM IST

ABOUT THE AUTHOR

...view details