తెలంగాణ

telangana

Telangana Diagnostics Hubs : 'పేదల వైద్య ఖర్చులు తగ్గించడంలో T-డయాగ్నోస్టిక్స్​ చొరవ అద్భుతం'

By

Published : Jul 2, 2023, 4:12 PM IST

KTR On Telangana Diagnostics Hubs : పేదల వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ చొరవ గొప్ప విజయాన్ని సాంధించిందని మంత్రి కేటీఆర్​ అన్నారు. 2018లో ఒక హబ్​తో ప్రారంభించిన ఈ డయాగ్నోస్టిక్స్.. నేడు జిల్లాలకు కూడా విస్తరించిందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కింద ఇప్పుడు 134 పరీక్షలు అందుబాటులో ఉన్నాయని ట్విటర్ వేదికగా కేటీఆర్​ ప్రకటించారు.

KTR On Telangana Diagnostics Hubs
KTR On Telangana Diagnostics Hubs

Telangana Diagnostics Free Medical Tests : తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ పని తీరును మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా అభినందించారు. జేబులో లేని వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ చొరవ గొప్ప విజయాన్ని సాధించిందన్నారు. 2018 జనవరిలో హైదరాబాద్​లో ఒక హబ్‌తో ప్రారంభించిన ఈ డయాగ్నోస్టిక్స్​.. నేడు ఇతర జిల్లాలకు కూడా విస్తరించిందని హర్షం వ్యక్తం చేశారు. దీనిపై చొరవ తీసుకున్న ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావుకు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ పని తీరు, విజయాలను వివరించారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్, స్పోక్ మోడల్‌లో ఉచిత డయాగ్నోస్టిక్ సేవలను అందిస్తుందని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. టీ-డయాగ్నోస్టిక్స్ 2 భాగాలను కలిగి ఉంటుందని తెలిపారు. 1. ఉచిత రోగలక్షణ సేవలు (రక్తం మరియు మూత్ర పరీక్షలు), 2. ఉచిత ఇమేజింగ్ సేవలు (X-రే, USG, ECG, 2D ECHO, మామోగ్రామ్) పొందవచ్చునని పేర్కొన్నారు.

Government Diagnostics Centres : ఇప్పటి వరకు డయాగ్నోస్టిక్ ద్వారా మొత్తం 57.68 లక్షల మంది రోగులు ప్రయోజనం పొందారని తెలిపారు. 10.40 కోట్ల పరీక్షలు నిర్వహించబడ్డాయని ప్రకటించారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కింద ప్రస్తుతం 134 పరీక్షలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ ఇన్-హౌస్ హబ్, స్పోక్ మోడల్ డయాగ్నోస్టిక్స్‌ను నీతి ఆయోగ్ సైతం ప్రశంసించిందని మంత్రి కేటీఆర్​ గుర్తు చేశారు.

Harish Rao on Telangana Diagnostics : హైదరాబాద్ కొండాపుర్ జిల్లా ఆసుపత్రి వేదికగా మంత్రి హరీశ్‌రావు శనివారం వర్చువల్‌గా డయాగ్నోస్టిక్స్ సేవలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌ ద్వారా ఇప్పటి వరకు 54 పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్లు ప్రకటించారు. మరో 134 వైద్య పరీక్షలను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను రోగి, వైద్యుల సెల్​ఫోన్​లకు పంపిస్తామని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కాన్‌, 2డి-ఎకో రేడియాలజీ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి హరీశ్​ రావు అన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోని డాక్టర్ల పనితీరు అద్భుతమని కొనియాడారు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్‌ స్థాయి ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వం మార్చిందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కేసీఆర్‌ కిట్, గర్భిణులకు కేసీఆర్‌ పౌష్టికాహార కిట్ అందిస్తోందని ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గతంలో 30 శాతం ప్రసవాలు జరిగితే.. ఇప్పుడు 70 శాతం జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details