ETV Bharat / state

‘డ్రైవ్‌-త్రూ’ సేవలను ప్రారంభించిన టెనెట్‌ డయాగ్నోస్టిక్స్‌

author img

By

Published : May 4, 2021, 11:59 AM IST

కరోనా రెండో దశ నేపథ్యంలో ఏ మాత్రం లక్షణాలు అనిపించినా జనం ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. అనుమానితులతో పరీక్షా కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలోనే డ్రైవ్-త్రూ సేవలను టెనెట్‌ డయాగ్నోస్టిక్స్‌ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. కారులోనే నమూనాలను సేకరించే సౌకర్యం కల్పించింది.

drive-through corona testes, hyderabad corona tests
డ్రైవ్ త్రూ కరోనా టెస్ట్, హైదరాబాద్​లో కరోనా పరీక్షలు

కొవిడ్‌ ఉద్ధృతితో కరోనా పరీక్ష కేంద్రాలు, ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో అవసరమైనవారు సురక్షితంగా తమ కారులోనే కూర్చుని కొవిడ్‌ 19 ఆర్టీ-పీసీఆర్‌, రక్త పరీక్షలకు నమూనాలు ఇచ్చే ‘డ్రైవ్‌-త్రూ’ సేవలను టెనెట్‌ డయాగ్నోస్టిక్స్‌ సంస్థ హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చింది. సోమవారం హైటెక్స్‌ వద్ద ఈ సేవలను ప్రారంభించింది.

పరీక్ష ఫలితాల్ని 24-48 గంటల వ్యవధిలో అందజేస్తామని, రోజుకు 250 మంది ఈ సేవలను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఈ తరహా పరీక్షలను నగరంలో ఇప్పటికే అపోలో ఆస్పత్రి ప్రవేశపెట్టింది.

ఇదీ చదవండి: ఊపిరాడట్లేదు... వాష్‌ రూంకు కూడా వెళ్లలేకపోతున్నాం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.