తెలంగాణ

telangana

KTR on Fuel Prices సుంకాల పేరుతో కేంద్రం భారీ దోపిడీకి పాల్పడిందన్న కేటీఆర్‌

By

Published : Aug 24, 2022, 9:03 PM IST

KTR on Fuel Prices మోదీ ప్రధాని పదవిలోకి వచ్చిన నాటి నుంచి పెట్రోల్ ధరలు పెంచుతున్నారని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. అంతర్జాతీయంగా ధరలు తగ్గినా.. కేంద్రం పెట్రో దోపిడి మాత్రం ఆగడం లేదని మండిపడ్డారు. ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించాలని కేంద్రాన్ని కేటీఆర్ కోరారు.

KTR on Fuel Prices
KTR on Fuel Prices

KTR on Fuel Prices: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గుతున్నందున ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పెట్రో సుంకాలను పూర్తిగా ఎత్తేస్తే ప్రతి లీటర్ పైనా ప్రజలకు దాదాపుగా 30 రూపాయల వరకు ఉపశమనం లభిస్తుందన్నారు. ప్రజలపై భారం వేసేందుకు చట్టాన్ని కూడా సవరించి.. పెట్రోల్, డీజీల్​పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని గరిష్ఠంగా పెంచుకొని ప్రజలపై భారం వేసేలా 2020లో కేంద్రం చట్టాన్ని కూడా సవరించిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఓ వైపు సెస్సులు, సుంకాల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్న మోదీ సర్కారు.. అ నెపాన్ని రాష్ట్రాలపై నెడుతోందని మండిపడ్డారు. పన్నుల రూపంలో ఇప్పటిదాకా మెత్తం 26 లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుంచి గుంజుకుందని కేటీఆర్ ధ్వజమెత్తారు

భారీగా సుంకాల పెంపు:పెట్రో ధరల పెరుగుదలకు అంతర్జాతీయ ముడిచమురు ధరలు కారణమంటూ కేంద్రం చేస్తున్న వాదనలో ఎలాంటి నిజం లేదన్నారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బ్యారెల్ ముడి చమురు ధర భారీగా తగ్గుతున్నప్పటికీ.. దేశంలో పెట్రో రేట్లు మాత్రం పెరుగుతూ పోతున్నాయని తెలిపారు. ముడిచమురు ధర తగ్గితే ఆ ప్రయోజనం దేశ ప్రజలకు ఇవ్వాల్సి వస్తుందేమోనన్న దుర్భుద్దితో కేంద్రం ఎక్సైజ్‌ సుంకాలను, సెస్సులను భారీగా పెంచుతోందని కేటీఆర్ మండిపడ్డారు.

ధరల నియంత్రణలో మోదీ విఫలం: బ్యారెల్ ధర తగ్గినా పెట్రో రేట్ల పెరుగుదల గత కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని అధికారంలోకి రాకముందు ఆరోపించిన నరేంద్ర మోదీ.. ధరల నియంత్రణలో ఘోరంగా విఫలమయ్యారని ఒప్పుకుంటారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2014లో బ్యారెల్‌ ముడిచమురు ధర దాదాపు 110 డాలర్లుగా ఉండేదని, 2015లో 50 డాలర్లకు, 2016లో 27 డాలర్లకు.. 2020లో ఏకంగా 11 డాలర్లకు పడిపోయిందన్నారు.

కేంద్ర సంస్థల గణాంకాల ప్రకారం మోదీ అధికారంలోకి వచ్చిన తొలి మూడేళ్లలోనే పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ 54 శాతం పెరిగితే, డీజిల్‌ మీద ఏకంగా 154 శాతం పెరిగిందన్నారు. పెట్రో ధరలను పెంచి ప్రజల నుంచి భారీగా వసూలు చేసిందని ధ్వజమెత్తారు. కొవిడ్ మహమ్మారితో ఓ వైపు దేశ ప్రజలు ఆర్థికంగా చితికిపోయిన సమయంలో కనికరం లేకుండా మోదీ సర్కార్ ఎక్సైజ్ సుంకాన్ని పెంచుకుంటూ పోయిందన్నారు. మోదీ సర్కారు 2020 నాటికే ఎక్సైజ్‌ డ్యూటీ రూపంలోనే సుమారు 14 లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసిందని కేటీఆర్ ఆరోపించారు.

అడ్డూ అదుపు లేకుండా మోదీ సర్కార్ పెంచిన పెట్రో రేట్లతో నిత్యావసరాల ధరలు పెరిగి దేశ చరిత్రలోనే అత్యధికంగా ద్రవ్యోల్బణం నమోదవుతూ.. పేద, మధ్యతరగతి వర్గాల పరిస్దితులు పూర్తిగా దిగజారిపోయాని కేటీఆర్ అవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ముడి చమురు బ్యారల్ ధర 95 డాలర్లకు తగ్గినా, పెట్రో రేట్లను తగ్గించడం లేదన్నారు. ప్రస్తుతం దేశ ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భరమైన ద్రవ్యోల్బణ పరిస్థితులు, కరోనా, లాక్ డౌన్, కేంద్ర ప్రభుత్వ విఫల విధానాల ఫలితంగా అనేక మంది ఉపాధి కోల్పోయినందున... కేంద్రం పెట్రోల్, డీజిల్ పైన ఉన్న అన్ని రకాల సెస్సులను రద్దు చేసి పెట్రో ధరలను తగ్గించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

భాజపా నాయకులపై ఫైర్: భాజపాపై మరోసారి మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా గుండాల క్రూరత్వం విని గగుర్పాటుకు గురయ్యానని తెలిపారు. ప్రజా సంగ్రామయాత్ర విఫలం కావడంతో దాడులకు దిగారని కేటీఆర్‌ మండిపడ్డారు. అధికారం కోసం రాష్ట్రంలో సామరస్యాన్ని చెడగొడుతున్నారు కేటీఆర్‌ అందోళన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:రోటవాక్‌ని ఇమ్యూనైజేషన్‌లో నైజీరియా భాగం చేసిందన్న భారత్‌ బయోటెక్‌

బలపరీక్షలో నెగ్గిన నీతీశ్, విపక్షాల ఐక్యతకు పిలుపు, మోదీపై సెటైర్లు

ABOUT THE AUTHOR

...view details