తెలంగాణ

telangana

Harish Rao Review: వీలైనంత త్వరగా పూర్తి చేయాలి: హరీశ్ రావు

By

Published : Nov 17, 2021, 9:00 PM IST

Minister harish rao review on covid vaccination
Minister harish rao review on covid vaccination ()

రాష్ట్రంలో వీలైనంత త్వరగా వందశాతం వ్యాక్సినేషన్ (covid vaccination)పూర్తి చేయాలని అధికారులను మంత్రి హరీశ్ రావు (minister harish rao)ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్​లోని బీఆర్కే భవన్​లో అన్ని జిల్లాల వైద్యాధికారులతో టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు.

వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్(covid vaccination) పూర్తి చేయాలంటే అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు(minister harish rao) సూచించారు. రాష్ట్రంలో టీకా పంపిణీ మరింత వేగవంతం చేయాలన్నారు. ఇవాళ హైదరాబాద్​లోని బీఆర్కే భవన్​లో అన్ని జిల్లాల వైద్యాధికారులతో(DMHO) టెలీ కాన్ఫరెన్స్​(teleconference) నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి టీకా అందించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

వికారాబాద్​ను ఆదర్శంగా తీసుకోవాలి

జనాభా ఎక్కువ ఉన్న పట్టణాల్లో ఇతర ప్రాంతాల్లోని సిబ్బందిని వినియోగించుకోవాలని డీఎంహెచ్​వోలకు మంత్రి హరీశ్ రావు(minister harish rao) సూచించారు. వికారాబాద్ జిల్లాలో వాక్సిన్‌ ప్రక్రియ వేగంగా‌ సాగుతోందని మంత్రి తెలిపారు. అన్ని జిల్లాలు వికారాబాద్​ను ఆదర్శంగా తీసుకుని వ్యాక్సినేషన్(covid vaccination) ప్రక్రియ వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. డీఎంహెవోలు(DMHO) క్షేత్రస్థాయిలో ‌ ఉండి వాక్సినేషన్ డ్రైవ్​లు నిర్వహించటంతోపాటు జిల్లా కలెక్టర్​తో పాటు అన్ని శాఖలను‌ సమన్వయం చేసుకుని లక్ష్యాన్ని చేరుకునే విధంగా ముందుకు సాగాలని మంత్రి వివరించారు.

ఇదీ చూడండి:

harish rao: 'ఎయిమ్స్​పై కిషన్​ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారు'

Minister Harish Rao: 'రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ వేగం పెంచండి'

ABOUT THE AUTHOR

...view details