తెలంగాణ

telangana

Harish Rao on Telangana MBBS seats : 'వైద్యసీట్ల పెంపులో తెలంగాణ మరో మైలురాయిని అందుకుంది'

By

Published : Jul 4, 2023, 6:12 PM IST

MBBS seats Allotment in 2023-24 year : ఎంబీబీఎస్ సీట్ల పెంపులో తెలంగాణ సర్కారు మరో కీలక మైలురాయిని అందుకుందని మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ విద్యా సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్లలో 43 శాతం తెలంగాణకు చెందినవేనని హరీశ్‌రావు ప్రకటించారు. ఈ మేరకు హరీశ్‌ రావు ట్వీట్ చేశారు. మరోవైపు అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్‌లో అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో పనిచేసే అడ్వాన్డ్స్ సర్ఫేస్ గైడెన్స్ సిస్టంను మంత్రి ప్రారంభించారు.

harish rao
harish rao

Minister Harish Rao latest comments : తెలంగాణ వైద్య సీట్ల పెంపులో సర్కారు మరో కీలక మైలురాయిని అందుకుందని వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. 2023-24 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ విభాగంలో దేశవ్యాప్తంగా 2118 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి రాగా అందులో 900 సీట్లు తెలంగాణ మెడికల్ కాలేజీలవే అని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్లలో 43 శాతం తెలంగాణకు వచ్చాయని పేర్కొన్నారు.

ఇది ఆరోగ్య తెలంగాణ లక్ష్యం దిశగా సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి నిదర్శనమని హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మిగతా మెడికల్ కాలేజీలకు సైతం అనుమతులు వస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు.

American Oncology Institute started Advance Surface Guidance System : సరైన ఆహారం తీసుకోవటం పట్ల ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని మంత్రి హరీశ్ రావు పిలిపునిచ్చారు. కలుషిత, పోషకాలు లేని ఆహారం తీసుకోవటం వల్ల ఇటీవల కాలంలో వ్యాధుల భారినపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని అమెరికన్ అంకాలజీ ఇనిస్టిట్యూట్‌లో అత్యాధునికఏఐ టెక్నాలజీతో పనిచేసే అడ్వాన్డ్స్ సర్ఫేస్ గైడెన్స్ సిస్టంను మంత్రి ప్రారంభించారు.

కార్యక్రమంలో అమెరికన్ అంకాలజీ ఇనిస్టిట్యూట్ ప్రాంతీయ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ ప్రభాకర్ సహా పలువురు వైద్యులు పాల్గొన్నారు. క్యాన్సర్ రోగులకు మెరుగైన చికిత్స అందించటంలో ఏఐ సాంకేతిక ఆధారంగా ఎథోస్ రేడియో థెరపీ చేసేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతోందని వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో మాట్లాడిన హరీశ్‌రావు.. దేశంలో రోజు రోజుకి క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున రోగులకు సేవ చేసేందుకు ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులు సైతం ఆరోగ్య శ్రీ సేవలను మరింత విస్తృతం చేయాలని కోరారు.

"మనం మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మిగితా అన్ని వ్యాధుల కంటే క్యాన్సర్ వృద్ధి రేటు మన దేశంతో ప్రపంచంలో కూడా వేగంగా పెరుగుతోంది. దీనిపై అందరికి అవగాహన ఉండాలి. ప్రభుత్వం తరుపున కూడా అన్నిజిల్లాలో క్యాన్సర్‌కు సంబంధించి ల్యాబ్‌లను విస్తరించడం జరిగింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తృతం చేయాలి. రోగులకు ఆరోగ్య శ్రీ ద్వారా సేవలు చేయండి. ప్రభుత్వం కూడా బిల్లులు సకాలంలో చెల్లిస్తోంది."-హరీశ్‌రావు, ఆరోగ్య శాఖ మంత్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details