తెలంగాణ

telangana

BRS Meeting in Maharashtra: బీఆర్ఎస్​కు మహారాష్ట్ర పోలీసులు షాక్.. బహిరంగ సభకు 'నో పర్మిషన్'

By

Published : Apr 19, 2023, 1:40 PM IST

Updated : Apr 19, 2023, 1:50 PM IST

BRS meeting in Maharashtra: ఈ నెల 24వ తేదీన మహారాష్ట్రలో జరగనున్న బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు అక్కడి పోలీసులు అనుమతి నిరాకరించారు. భద్రతా కారణాల దృష్ట్యా అంఖాస్‌ మైదానంలో సభకు అనుమతి ఇవ్వలేమని ఔరంగాబాద్‌ పోలీసులు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి మరో ప్రదేశాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఔరంగాబాద్ పోలీసులపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అదే రోజున వేరే ప్రదేశంలో బహిరంగ సభను నిర్వహించడానికి గులాబీ దళం సిద్ధమైంది.

BRS
BRS

BRS meeting in Maharashtra: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌ (ఔరంగాబాద్)లో ఈనెల 24వ తేదీన భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఔరంగాబాద్‌లోని అంఖాస్‌ మైదానంలో బహిరంగ సభ జరపడం వీలుకాదని పోలీసులు స్పష్టం చేశారు. సభకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని మిలింద్ కాలేజీకి దగ్గరలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోమని సూచించగా.. అందుకు సీఎం కేసీఆర్‌ నిరాకరించినట్లు తెలుస్తోంది.

BRS Public meeting in Maharashtra : మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో గులాబీ నేతలకు పెద్ద ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పుకోవచ్చు. మహారాష్ట్రలో తమ పార్టీ బలంగా ఉందని.. ఎక్కువ మంది రాజకీయ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. తమ ప్రభుత్వ విధివిధానాలు, పథకాలు నచ్చి చాలా మంది పార్టీలోకి రావడానికి ఇష్టపడుతన్నారని పలు సందర్బాల్లో వ్యాఖ్యానించారు. అంతే కాకుండా నెల రోజులు క్రితమే.. ఈనెల 18 లేదా 24వ తేదీల్లో అక్కడ బహిరంగ సభ పెట్టడానికి పక్కా ప్రణాళికలు రచించారు.

Maharashtra Police denies permission to BRS Meeting : ఈ నేపథ్యంలోనే ఈనెల 24న ఔరంగాబాద్​లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఆ సభకు సంబంధించిన పోస్టర్లను కూడా విడుదల చేశారు. అందుకు తగినట్టుగా భారీ జన సమీకరణపై ఫోకస్ చేశారు. ఈ సమావేశంలోనే స్థానిక నాయకుల చేరికలు కూడా జరపాలని అనుకున్నారు. అంతా అనుకున్నట్లే జరుగుతుండగా.. అకస్మాత్తుగా ఇవాళ మహారాష్ట్ర పోలీసులు బీఆర్ఎస్​కు షాక్ ఇచ్చారు. సభకు అనుమతి నిరాకరిస్తున్నట్లు చెప్పడంతో బీఆర్ఎస్ శ్రేణులు గందరగోళానికి గురయ్యారు.

మరట్వాడా నుంచి వేల మంది కార్మికులు ఈ సమావేశానికి తరలిరానున్న నేపథ్యంలో పోలీసులు అనుమతివ్వకపోయినా సభను అదే రోజు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అందుకోసం వేరే ప్రాంతాన్ని ఎంపిక చేసే పనిలో పడింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఈ సభకు తరలిరానున్నందున.. ఔరంగాబాద్​లోనే బిడ్ బైపాస్ రోడ్డు దగ్గరలో ఉన్న జంబిడా మైదానంలో సభను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. భారీ సంఖ్యలో ప్రజలు తరలిరానున్నందున.. దానికి అంఖాస్‌ మైదానం సరిపోదని, పార్కింగ్‌ స్థలం కూడా తగినంత లేదని అందువల్ల సభాస్థలిని జంబిడా మైదానానికి మార్చినట్లు బీఆర్ఎస్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. కార్యకర్తలు, కేసీఆర్‌ అభిమానులు సభకు భారీ సంఖ్యలో ఈ బహిరంగ సభకు తరలి రావాలని కోరాయి.

Last Updated :Apr 19, 2023, 1:50 PM IST

ABOUT THE AUTHOR

...view details